/rtv/media/media_files/2025/04/01/xVqrmZKcnnTSK36LOvfh.jpg)
paster Photograph: (paster)
Rape case: పంజాబ్ పాస్టర్ బజీందర్ సింగ్ అత్యాచారం కేసులో మొహాలీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తన ఆఫీసులో ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డ బజీందర్‌కు జీవిత ఖైదు విధించింది. 8 ఏళ్లపాటు జరిగిన విచారణలో అతన్ని దోషిగా ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 5 మందిని నిర్దోషులుగా తేల్చింది.
Mohali court pronounces Pastor Bajinder Singh guilty in a 2018 sexual harassment case.
— DD News (@DDNewslive) March 28, 2025
The quantum of sentence would be pronounced on April 1.#PastorBajinder #BajinderSingh pic.twitter.com/2Q9V5Vqogx
విదేశాలకు పంపిస్తానంటూ..
ఈ మేరకు క్రైస్తవ మతబోధకుడు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ బాజిందర్ సింగ్ 2018లో విదేశాలకు వెళ్లేందుకు సాయం చేస్తానంటూ జికాపూర్‌కు చెందిన మహిళను నమ్మించాడు. అనంతరతం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ సమయంలో వీడియోలు తీసిన దుర్మార్గుడు.. సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు రంజీత్ కౌర్ పాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతనిని అరెస్టు చేశారు. అనంతరం విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
అనతికాలంలోనే పాపులర్..
హరియాణాకు చెందిన బాజిందర్ సింగ్ జాట్ కుటుంబంలో జన్మించాడు. 2012లో మతబోధకుడిగా మారి.. జలంధర్, మొహాలిలలో ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే చాలా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలోనూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అయితే ఇతనిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెకు నయం చేస్తానని డబ్బులు తీసుకున్నట్లు ఢిల్లీకి చెందిన దంపతులు 2022లో కేసు పెట్టారు. 2023లో సింగ్‌పై ఆదాయపు పన్ను శాఖ సోదాలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల కపుర్తలా స్టేషన్‌లోనూ బజీందర్‌పై కేసు నమోదైంది. ఓ మహిళపై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోషల్ మీడియాలోనూ మహిళపపై దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
paster praveen | sexcual harrisement | girl | telugu-news | today telugu news