PB: పంజాబ్ లో 1200 ట్రావెల్ ఏజెన్సీలపై దాడులు..ఏడుగురు అరెస్ట్

పంజాబ్ లో అక్రమ ఏజెంట్లకు అడ్డకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.  ఇందులో భాగంగా 1200లకు పైగా ఏజెన్సీలపై సోదాలను నిర్వహించారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. 

New Update
pb

Punjab Police Raids

డాంకీ రూట్‌ ద్వారా అమెరికాకు పంపే ట్రావెల్ ఏజెంట్లపై పంజాబ్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. పంజాబ్ పోలీసులు అమృత్‌సర్, జలంధర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో దాడులు చేశారు. పంజాబ్‌కు చెందిన 131 అమెరికా నుంచి బహిష్కరణకు గురైయ్యారు. వారిలో 17 మంది ట్రావెల్ ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పంజాబ్ పోలీసులు ట్రావెల్ ఏజెంట్లపై కేసులు బుక్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

1200 ఏజెన్సీలపై ఉక్కుపాదం..

అక్రమంగా విదేశాలకు పంపించే ట్రావెల్ ఏజెన్సీలపై పంజాబ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇంతకు ముందే పదుల సంఖ్యలో ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసిన ప్రభుత్వం...తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్ ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించారు. 1200కు పైగా సంస్థలపై దాడులు చేసినట్లు సమాచారం. దాదాపు ఏడుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఇకపై మరింత మంది యువత మోసపోకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం తెలిపింది.  ఇప్పుడు ఆ సంస్థల తాలూకా లైసెన్సులను క్యాన్సిల్ చేయాలని ప్రభుత్వం బావిస్తోంది. వారందరినీ విచారించి, ఏజెన్సీల చేస్తున్న పనిని పూర్తిగా గమనించాకే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 

డీజీపీ ఆదేశాల మేరకు అక్రమంగా విదేశాలకు వెళ్లడాన్ని అరికట్టేందుకు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టిన అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లోనే అక్రమాలకు పాల్పడుతున్న 24 మంది ట్రావెల్‌ ఏజెంట్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రతి ఏజెంటు తప్పనిసరిగా లైసెన్సును ప్రదర్శించడంతోపాటు క్లయింట్, సర్వీసుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. 

Also Read: TS: అన్ని స్కూళ్ళల్లో తెలుగు తప్పనిసరి..విద్యాశాఖ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు