/rtv/media/media_files/2025/02/19/M4kITDd7Hzml5bljQ41d.jpg)
Punjab govt Photograph: (Punjab govtబ)
Punjab Police: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 52 మంది పోలీసులపై వేటు పడింది. ఒకేసారి ఇంతమొత్తంలో పోలీసులపై చర్యలు తీసుకోవడం హాట్ టాపింగ్‌గా నిలిచింది. అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జిల్లా కమిషనర్‌ను కూడా సస్పెండ్ చేసింది పంజాబ్ ప్రభుత్వం(Punjab Govt). పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. లంచాలు తీసుకునే, దురుసుగా ప్రవర్తించే పోలీసులకు వ్యతిరేకంగా భగవంత్ మాన్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నారు.
Also Read: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా స్కామ్‌లో లోకాయుక్తా క్లీన్ చీట్
Punjab DGP Gaurav Yadav:
— Man Aman Singh Chhina (@manaman_chhina) February 19, 2025
Action taken against those police officers against whom FIRs have been registered or have complaints against them for misconduct, 52 personnel from Constable to Inspector have been dismissed from service. pic.twitter.com/AwYMp1lXfh
Also Read: chaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్
52 మంది పోలీసులు సస్పెండ్..
గవర్నమెంట్ అధికారులు ఎవరైనా లంచం అడిగా, తీసుకున్న దాన్ని వీడియో, ఆడియోల రూపంలో రికార్డ్ చేసి ఫిర్యాదు చేశాలని అవినీతి శాఖ అధికారులు కోరారు. ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. అధికారులు, పోలీసు సిబ్బంది, రాజకీయ నాయకులలో ఏ స్థాయిలోనైనా అవినీతిని సహించబోమని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 52 మంది పోలీసులను విధుల నుంచి తప్పించారు.
ఢిల్లీలో ఆప్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత, పంజాబ్‌లో అవినీతి వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిప్యూటీ కమిషనర్లు, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్లు, సీనియర్ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తమ తమ ప్రాంతాల్లో అవినీతి రహిత పరిపాలనను నిర్ధారించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించని అధికారులు కఠిన చర్యలను ఎదుర్కొంటారని ప్రభుత్వ వర్గాలు వార్నింగ్ జారీ చేశాయి.
Also Read: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!