Kangana Ranuat: తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ

తన ఇంటి కరెంట్ బిల్లు రూ.లక్ష వచ్చిందంటూ మండి ఎంపీ కంగనా రౌనత్ చేసిన గొడవ రాజకీయ చర్చకు కారణమైంది. ఇది బీజేపీ, కాంగ్రెస్ గొడవగా మారింది. దాంతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అదంతా ఆమె ఇంటి కరెంట్ బిల్లేనంటూ లెక్కలతో సహా చూపించింది.

New Update
Kangana Ranaut

Mandi MP Kangana Ranuat

బాలీవుడ్ స్టార్, మండి ఎంపీ కంగనా రౌనత్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు వచ్చిందంటూ గోల చేసింది కంగనా. తప్పంతా కాంగ్రెస్ ప్రభుత్వందే అంటూ మండిపడింది. ఒక్క రోజు కూడా ఉండని ఇంటికి లక్ష బిల్లు ఎలా వస్తుంది అంటూ రచ్చరచ్చ చేసింది. ఇంకేముంది దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం మొదలైంది. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చింది. కంగనా ఇంటికి వచ్చిన బిల్లు లక్ష కాదని రూ. 55 వేలు మాత్రమేనని చెప్పింది. అది కూడా ఆమె చాలా ఏళ్ళుగా బిల్లు కట్టలేదని మొత్తం వెరసి అంత అయిందని క్లియర్ గా లెక్కలు చూపించింది. 

అంతా కాంగ్రెస్సే చేసింది..

మాట్లాడితే చాలు కాంగ్రెస్ మీద విరుచుకుపడిపోతుంది కంగనా రౌనత్. ఎక్కడ అవకాశం దొరుకుతుందా..వేసుకుందామని అని ఎదురు చూస్తుంటుంది. అలాంటి ఆమెకు హిమాచల్ ప్రదేశ్ లో తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు దొరికింది. ఇంకేం ఇదే సందని..మీడియా ముందు కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగింది. తాను నివాసమే ఉండని ఇంటికి అంత బిల్లు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించింది. దాంతో పాటూ హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటని.. రాష్ట్ర ప్రజలందరూ తనతో కలిసి ఇలాంటి సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇది కాస్తా రాజకీయ చర్చకు కారణంగా మారింది. 

లెక్కలు చూపించిన విద్యుత్ శాఖ..

దాంతో హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. ఆమెకు వచ్చిన బిల్లు లక్ష కాదని రూ.55 వేలేనని తేల్చారు. అయితే ఈ 55 వేల రూపాయలు కేవలం ఈ నెల బిల్లు మాత్రమేనని కానీ ఆమె గతంలో చెల్లించని బిల్లులు కూడా కలిపి రూ.91,100 గా పూర్తి బిల్లు వచ్చిందని చెప్పారు. చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే ఇంత మొత్తంలో బిల్లు వచ్చేది కాదని సందీప్ కుమార్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా రనౌత్ దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారని...అందుకే ఒక్క నెల బిల్లు కూడా రూ. 55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా చూపించారు.   అలాగే తాము కంగనాకు రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు తెలిపారు. 

today-latest-news-in-telugu | kangana-ranuat | power-bills | congress | himachal-pradesh

 

Also Read: Alahabad: అత్యాచారం చేయడానికి కారణం ఆమే..అలహాబాద్ హైకోర్టు మరో సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment