/rtv/media/media_files/2024/10/27/jVFopqvEIubvtvaNRMrG.jpg)
PM Modi
ముంబయ్ పేలుళ్లకు స్కెచ్ వేసిన ఉగ్రవాది తహవూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా భారత్ కు అప్పగించింది. నిన్న అతడిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ 14 ఏళ్ళ కిందటి పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతూ మోదీ పోస్ట్ పెట్టారు. ఆ పార్టీ దౌత్య విధానాలు సరిగ్గా లేవంటూ దుయ్యబట్టారు.
మోదీ పాత పోస్ట్..
2011లో ముంబయ్ అటాక్ లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని అమెరికా కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ ఘటనకు కారణమైన ఉగ్ర సంస్థకు అండగా నిలిచాడన్న అభియోగాలపై అతడిని దోషిగా తేల్చింది. దీనిపై మోదీ ట్విట్టర్ లో స్పందించారు. తహవూర్ రాణాను నిందితుడు కాదని అనడం భారత సార్వభౌమత్వాన్ని అవమానించడమే అంటూ అందులో రాశారు. ఇది మన దేశ విదేశాంగ విధానానికి భారీ ఎదురు దెబ్బ అన్నారు. ఇప్పుడు మోదీ నాయకత్వంలో తహవూర్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించడంతో...ఆ పాత పోస్ట్ ను నెటిజన్లు మళ్ళీ షేర్ చేస్తున్నారు. ప్రధాని మోదీ దౌత్య విధానాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. రాణాను తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం పెద్ద విజయాన్నే సొంతం చేసుకుందని నెటిజన్లు అంటున్నారు.
అమెరికా స్పందన..
మరోవైపు రాణా అప్పగింతపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఉగ్రదాడులకు శిక్ష పడేందుకు భారత్ చేస్తున్న ప్రతీ పనికి అమెరికా మద్దతునిస్తుందని చెప్పింది. ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడానికి రెండు దేశాలూ ఎప్పుడూ కలిసి పని చేస్తాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ వ్యాఖ్యానించారు.
today-latest-news-in-telugu | pm modi | Tahawwur Rana | twitter | post
Also Read: Mumbai Attack: తహవూర్ రాణా వచ్చాడు మరి హెడ్లీ సంగతేంటి?