/rtv/media/media_files/2025/01/13/cfwHbG2p9aSSQIu147cS.jpg)
PM to launch Sonamarg tunnel in J&K today Photograph: (PM to launch Sonamarg tunnel in J&K today)
దేశ ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) 2025 జనవరి 13వ తేదీన జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) లో పర్యటించనున్నారు. గాందర్‌బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని ఆయన ఇవ్వాళ ప్రారంభించనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఈ టన్నెల్‌కు చేరుకుని.. దాని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆయన వెంట ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర నేతలు కూడా పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం అనంతరం మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు, ఆ తర్వాత సొరంగం నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతో మోదీ సమావేశం కానున్నారు. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి. దీనిని మోదీ లాంఛనంగా ఇవ్వాళ ప్రారంభిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. ముఖ్యమైన కూడళ్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
Also Read : తెలుగింటి బాపు బొమ్మలా.. లంగా వోణీలో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూడండి!
I am eagerly awaiting my visit to Sonmarg, Jammu and Kashmir for the tunnel inauguration. You rightly point out the benefits for tourism and the local economy.
— Narendra Modi (@narendramodi) January 11, 2025
Also, loved the aerial pictures and videos! https://t.co/JCBT8Ei175
Also Read : గ్యాస్ స్టేషన్ లో పేలుడు..15 మంది మృతి!
12 కిలోమీటర్ల రహదారి
జమ్మూకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ ప్రాంతంలో రూ.2 వేల 700 కోట్లతో జడ్ మోడ్ టన్నెల్ ను నిర్మించారు . సోన్‌మార్గ్ దారి అంతా కొండలు, మంచుతో నిండిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ ఎప్పుడూ కొండచరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారుతున్నాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ 12 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. ఇది సముద్రమట్టానికి 8 వేల650 అడుగుల ఎత్తులో ఉంది. ఇది శ్రీనగర్- సోన్‌మార్గ్‌ల మధ్య ప్రయాణాన్నికూడా సులభతరం చేస్తుంది. ఈ టన్నెల్ ఇప్పుడు పూర్తయింది.
Also Read : నేటినుంచే మహా కుంభ మేళా..దేశ వ్యాప్తంగా 13 వేల రైళ్లు!
Also Read : బాలయ్య ఫ్యాన్స్కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్