PM Modi: అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ గెలుపు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు.

New Update
PM Modi

PM Modi

పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఈసారి ఎన్నికల్లో తుపాకి శబ్దాల కన్నా జనం శబ్దాలే వినిపించాయన్నారు. '' బీజేపీకి ఇది చారిత్రాత్మకమైన రోజు. ఇకనుంచి బెంగాల్‌లో భయాందోళనలు ఉండవు. బెంగాల్ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ పనిచేస్తుంది. ముఖ్యంగా చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. బెంగాల్‌లోకి వచ్చే చొరబాటుదారులను అడ్డుకుంటాం.

Also Read: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!

బీజేపీ ఉన్నచోటే అభివృద్ధి ఉంటుంది. అందుకే ప్రజలు మాకు పట్టం పడుతున్నారు. బెంగాల్‌లో ఎన్నికలంటే గతంలో హింసాత్మక ఘటనలు జరిగేవి. ఈసారి మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. దేశంలో మరో కొత్త పరిణామం కనిపిస్తోంది. దేశంలో ఇప్పుడూ ఎక్కడా కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు లేవు. కాంగ్రెస్ విపరీత ధోరణిలో వెళ్తోంది. అడవుల్లో నక్సలిజం పూర్తిగా అంతరించింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌లో అర్బన్ నక్సలిజం కనిపిస్తోంది. విపక్ష పార్టీలు విభజన రాజకీయాలు చేసేందుకు కుట్రకు పాల్పడ్డాయి. విభజన కాదు. వికాస్, విశ్వాస్ రావాలని  ప్రజలు ఈ ఎన్నికల ద్వారా నిరూపించారు. 

Also Read: ఆ విషయంలో పవన్, KCR ఫెయిల్.. విజయ్ సక్సెస్.. ఇంట్రెస్టింగ్ న్యూస్!

కాంగ్రెస్ క్రమక్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతోంది. దేశ సంస్కృతి, ఆకాంక్షలను ఈ పార్టీ అర్థం చేసుకోవడం లేదు. బీజేపీ కేవలం జాతీయ పార్టీ మాత్రమే కాదు. ప్రాంతీయ ఆకాంక్షలను సైతం అర్థం చేసుకునే పార్టీ'' అని ప్రధాని మోదీ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు