PM Modi: దేశంలో UGC, వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

ఉమ్మడి పౌరస్మృతి (UGC), వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంశాలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చట్టాలను కేంద్రం అమలు చేస్తుందనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ వీటిపై కీలక ప్రకటన చేశారు.

New Update
Positive discussions underway on Uniform Civil Code, 'One Nation, One Election': PM Modi

Positive discussions underway on Uniform Civil Code, 'One Nation, One Election': PM Modi

ఉమ్మడి పౌరస్మృతి (UGC), వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంశాలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ చట్టాలను కేంద్రం అమలు చేస్తుందనే ప్రచారం కూడా నడిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ(pm modi) వీటిపై స్పందించారు. యూజీసీ, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌(one-nation-one-election) పై తమ ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోందని పేర్కొన్నారు. తమ పార్టీ అమలు చేయాల్సిన ఎజెండాల్లో అవి రెండు మిగిలి ఉన్నాయని తెలిపారు. అంతేకాదు వీటిగురించి దేశ ప్రజలు సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. BJP వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. '' కాంగ్రెస్ పాలనలో బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ వాళ్లను టార్గెట్ చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలో చాలామంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రాల్లో హింస రాజకీయ సంస్కృతిగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో ఉమ్మడి పౌరస్మృతి, వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. వీటి విషయంలో పాజిటివ్ కోణంలో మా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

Also Read: అసెంబ్లీలో గేట్లు పగలగొట్టుకుని దూసుకెళ్లిన కారు.. స్పీకర్ ఆఫీస్ వద్ద బొకే పెట్టి పరార్

బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న వందల నల్ల చట్టాలను రద్దు చేశాం. ప్రజాస్వామ్యంగా కొత్త పార్లమెంట్‌ను నిర్మించాం. జనరల్ కేటగిరీలో పేద పిల్లలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ బిల్లు, అయోధ్యలో రామమందిరం పూర్తయ్యాయి. బీజేపీ కార్యకల్తలు తమ పార్టీని తల్లిలాగా చూసుకుంటారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అంటే రాజకీయ ఈవెంట్ కాదు.. అదొక భావోద్వేగమని'' ప్రధాని మోదీ అన్నారు. 

వన్‌ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ?

దీనిప్రకారం దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారు. దీన్నే జమిలి ఎన్నికలు అని కూడా పిలస్తారు. ప్రస్తుతం మన దేశంలో లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి. దీనివల్ల ఖర్చు ఎక్కువగా అవుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే  దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు పూర్తి చేసేలా వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. 

Also Read :  రోడ్ల పైకి వస్తున్న పశువులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఉమ్మడి పౌరస్మృతి (UGC) అంటే 

దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడాన్ని ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) అని పిలస్తారు.  అంటే ఏ మతానికి చెందిన వారైనా సరే.. వివాహం, విడాకులు, వారసత్వం (ఆస్తి పంపకాలు), దత్తత వంటి వ్యక్తిగత విషయాల్లో వీళ్లందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. మతంతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరినీ చట్టం ముందు సమానంగా చూడటం, ముఖ్యంగా మహిళలకు అన్ని మతాల్లో సమాన హక్కులు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని కేంద్రం చెబుతోంది. 

Advertisment
తాజా కథనాలు