PM Modi: దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గుతాయా ?.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ

కేరళలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లు కోల్పోతాయని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ వాదనలు అవాస్తమని తేల్చిచెప్పారు.

New Update
PM Modi says Lok Sabha seats won't be reduced in South India

PM Modi says Lok Sabha seats won't be reduced in South India

కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కేరళలో ఈశాన్య రాష్ట్రాల్లో లాగే అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు. 

Also Read: తమిళనాడులో ఆ పార్టీకే అధికారం.. ప్రీపోల్‌ సర్వేల్లో వెల్లడి

మరోవైపు కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లు కోల్పోతాయని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ వాదనలు అవాస్తమని తేల్చిచెప్పారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు తగ్గుతాయని ఇటీవల కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. సీట్లు తగ్గుతాయనే వాదనలు అవాస్తవమని స్పష్టం చేశారు. 

Also Read: కేరళలో అధికార మార్పు.. ఆ పార్టీకే అధికారం.. లోక్‌పోల్‌ సర్వే సంచలన రిపోర్టు

ఇదిలాఉండగా.. కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకొస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దీనివల్ల శబరిమలలో స్థానిక వ్యాపారాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తిగా వదిలేసిందంటూ విమర్శలు చేశారు. ఈసారి బీజేపీ ప్రభుత్వం కేరళలో అధికారంలోకి వస్తే ఎలాంటి అడ్డుంకులు ఉండవని స్పష్టం చేశారు. ఇదిలా కేరళలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4 న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 

Advertisment
తాజా కథనాలు