PM Modi: ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారక, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. యమునా నదిని హర్యానా ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తోందని ఆరోపించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అప్పుడు కూడా ఇలానే.. కుంభమేళాలో 800 మంది మృతి
నేను తాగే నీళ్లల్లో విషం..
''ప్రధానిమంత్రి తాగే నీళ్లలో హర్యాణాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా ?. ఢిల్లీ మాజీ సీఎం హర్యానా ప్రజలపై అసహ్యకరమైన ఆరోణలు చేశారు. ఓడిపోతామనే భయంతో ఆప్ నేతలు ఆందోళన పడుతున్నారు. హర్యానా, ఢిల్లీలో నివసించే ప్రజలు ఒకరు కాదా?. హర్యానాలో ఉండేవారికి బంధువులు ఢిల్లీలో లేరా ?. తమ సొంత ప్రజలు తాగే నీటిని ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తారా ?. హర్యానా నుంచి వస్తున్న నీటిని ఢిల్లీలో ప్రతిఒక్కరూ వాడుతున్నారు. ఇందులో నేను కూడా ఉన్నాను.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు 25 ఏళ్లు పాలించాయి. కానీ ఇప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ కావడం, నీళ్లు నిలిచిపోవడం, కాలుష్యం ఇలా అన్ని సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. మీరు వేసే ఓటు వీటి నుంచి విముక్తి కలిగించగలదు. 11 ఏళ్ల పాటుగా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
Also Read: ఇది 8వ వింత! యువతి కడుపులో బిడ్డ.. ఆ బిడ్డ కడుపులో మరో బిడ్డ!
25 ఏళ్ల ఫ్యూచర్ ప్లాన్ వేయాలి. 25 ఏళ్ల పాటు ఈ రెండు పార్టీల పాలనను చూశారు. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండని'' ప్రధాని మోదీ ఓటర్లను కోరారు. ఇదిలాఉండగా.. ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈసారి దేశ రాజధానిలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!