HPV Vaccination Drive: గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌.. 14 ఏళ్ల లోపు బాలికలను ఫ్రీగా HPV వ్యాక్సిన్

శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

New Update
PM Modi launches nationwide HPV vaccination drive

PM Modi launches nationwide HPV vaccination drive

భారత్‌లో చాలామంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్ క్యాన్సర్) తో బాధపడుతున్నారు. ఈ మహమ్మారిని నిర్మూలించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ(PM Modi).. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్‌(HPV Vaccination Drive) ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ వ్యాక్సిన్(free HPV vaccine) ద్వారా కోట్లాది మంది బాలికలకు సర్వైకల్ క్యాన్సర్‌ నుంచి రక్షణ లభించనుంది. 

ఈ వ్యాక్సిన్ ఎవరికి ? 

14 ఏళ్లు నిండి 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఈ వ్యాక్సిన్‌ను వేయనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ ఈ టీకాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. సింగిల్ డోస్ కింద గార్డాసిల్–4 వ్యాక్సిన్‌ను ఎడమ చేతికి వేస్తారు. ఆ తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంక్ పెడతారు. ఇందుకోసం యూ–విన్ (U-–WIN) పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో కుదరకపోతే నేరుగా సెంటర్‌కు వెళ్లి కూడా టీకా వేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ మూడు నెలల పాటు సాగనుంది. టీకా తీసుకునే బాలికలు తప్పకుండా టిఫిన్ లేదా భోజనం చేసి రావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోవద్దని సూచించింది. 

Also Read: భారత పార్లమెంట్‌కు తొలిసారి LGBTQ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి ?

టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. జ్వరం, తలనొప్పి రావడం కామన్ అని ఆ తర్వాత భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది తప్పనిసరి కాదు. నచ్చివాళ్లు వేసుకోవచ్చు. ఎవరిపై బలవంతం ఉండదు. కానీ తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, లేదా అలర్జీలతో బాధపడుతున్న వాళ్లకి ఈ వ్యాక్సిన్ వేయరు. స్కూళ్లు, అంగన్​వాడీలు, PHCల ద్వారా అర్హులైన బాలికలను గుర్తించి టీకాలు వేయనున్నారు. 

HPV వ్యాక్సిన్ ఎందుకు ?

గర్భాశయ క్యాన్సర్(cervical-cancer) అనేది ముఖ్యంగా 'హ్యూమన్ పాపిల్లోమా వైరస్' (HPV) వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకకముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 90 శాతానికి పైగా క్యాన్సర్ ముప్పును నియంత్రించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్‌ కేసుల్లో భారత్‌ వాటా ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మహిళలు ఈ వ్యాధి వల్ల చనిపోతున్నారు. అందుకే కేంద్రం గార్డాసిల్–4 వ్యాక్సిన్‌ను ఫ్రీగా పంపిణీ చేస్తోంది. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో చూసుకుంటే ఈ టీకా ధర దాదాపు రూ. 5 వేల వరకు ఉంటుంది. 

Also Read: అగ్నివీర్‌లు, ఆర్మీ సిబ్బందికి గుడ్‌న్యూస్‌.. రిటైరయ్యాక ఆ శాఖలో ఉద్యోగాలు

Advertisment
తాజా కథనాలు