PM Modi: మే 4న తర్వాత ఆ ఫైల్స్‌ బయటపెడతాం.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో భారీగా ఓటర్లు పాల్గొనడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మే 4 తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యాలకు సంబంధించిన ఫైల్స్‌ అన్నీ బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. 

New Update
PM Modi

PM Modi

పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో భారీగా ఓటర్లు పాల్గొనడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమంటూ కొనియాడారు. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దమ్‌దమ్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఎన్నికల్లో ఈ ఓటింగ్ శాతం చూసి టీఎంసీ పార్టీకి భయం పట్టుకుందని విమర్శించారు. మే 4న నిర్వహించే ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యాలకు సంబంధించిన ఫైల్స్‌ అన్నీ బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. 

Also read: అయిదు రాష్ట్రాల్లో గెలుపు వారిదే.. సంచలన ప్రీ పోల్‌ సర్వే నివేదికలు

'' పశ్చిమ బెంగాల్‌లోని ప్రజలకు, బీజేపీ కార్యకర్తలను ఒక విషయం చెబుతున్నాను. ఇది విప్లవాల గడ్డ అని ఎవరూ మర్చిపోవద్దు. అందుకే మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ గుండాలు దాక్కునేందుకు రాష్ట్రంలో చోటు అనేదే ఉండదు. వీళ్లను ఎవరూ కూడా రక్షించలేరు. మమతా బెనర్జీ సర్కార్ చేస్తున్న జంగిల్ రాజ్‌కు ఎండ్‌కార్డు పడే సమయం దగ్గరపడింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో జరిగిన ప్రతి అన్యాయానికి, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ బయటికి తీసుకొస్తాం. ఇది మోదీ గ్యారెంటీ '' అని ప్రధాని మోదీ తెలిపారు.

Also Read: ఢిల్లీలో దాడులకు ప్లాన్‌...ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్‌

 ఇక మొదటి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్‌లో కూడా ఇంతే స్థాయిలో భారీగా ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు టీఎంసీ పార్టీని మహిళా వ్యతిరేకి అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం, భద్రత, సాధికారత కల్పించడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. దీన్ని సహించేది లేదని.. అధికార ప్రభుత్వాన్ని గద్దె దించాలని మహిళలను నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా పశ్చిమ బెంగాల్ మొదటి దశలో ఎన్నికల్లో సుమారం 92.59 శాతం ఓటింగ్ నమోదైంది.  రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధిక ఓటింగ్ శాతంగా రికార్డు సృష్టించింది. 

Advertisment
తాజా కథనాలు