PM Modi: ఈద్ సందడి.. ముస్లింలకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్

రంజాన్ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు.

New Update
PM Modi

PM Modi

సోమవారం ముస్లింలు ఈద్‌ వేడులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దీంతో అన్నీ మసీదుల్లో సందడి వాతవరణం నెలకొంది. ముస్లింలందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో  విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు. 

అలాగే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల వేళ అందరూ సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేసేలా ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఇదిలాఉండగా.. ఆదివారం సాయంత్రం ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతంలో ఆకాశంలో ఈద్‌ ఉల్ ఫితర్ చంద్రుడు కనపించాడు. దీంతో పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో దేశవ్యాప్తంగా సోమవారం ముస్లిం ప్రజలు ఈద్‌ జరుపుకుంటున్నారు. 

ramadan | pm modi | telugu-news | rtv-news | national

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Moon: చంద్రుడిపై నిర్మాణాలు.. బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ!

చంద్రుడిపై ఉష్ణోగ్రతలకు కారణంగా నిర్మాణాలు చేపడితే ఇటుకలు ఎక్కువగా బీటలువారే ప్రమాదం ఉంటుంది. పగిలిన ఇటుకలను మరమత్తులు చేయడానికి బెంగళూరులోని IISC పరిశోధకులు ఓ పదార్థాన్ని కనుగొన్నారు. స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాతో ఓ పదార్థాన్ని తయారు చేశారు.

New Update
_repair damaged bricks

_repair damaged bricks Photograph: (_repair damaged bricks)

చంద్రమండలంపై మానవ మనుగడ గురించి ప్రస్తుతం అధ్యాయనాలు జరుగుతున్నాయి. ఒకవేళ చంద్రుడిపై మనుషుల నివాసం సాధ్యమైతే.. అక్కడ నిర్మాణాలు చేయడానికి ఇటుకలు కావాలి. అంతేకాదు మూన్ మీద ఉన్న వైవిధ్య ఉష్ణోగ్రతల కారణంగా ఇటుకలు బీటలువారే ప్రమాదముంది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. చంద్రునిపై వాతావరణం కఠినంగా ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఒక్కరోజులో 121 డిగ్రీల సెల్సియస్‌ దాకా పెరిగి.. మైనస్‌ 133 డిగ్రీల సెల్సియస్‌ వరకూ పడిపోతూ ఉంటుంది. అంతేకాక తీక్షణమైన సౌర పవనాలు, తోకచుక్కలు అక్కడ నిత్యకృత్యమే. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం వల్ల ఇటుకల్లో పగుళ్లును నియంత్రించడానికి ఓ పదార్థాన్ని కనుగొన్నారు. అది కూడా చంద్రుడిపై ఉండే బ్యాక్టీరియాతో తయారు చేశారు.

Also read: Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

ఇటుకల్లో పగుళ్లు నివారించేందుకు బ్యాక్టీరియాను ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను  ఫ్రాంటియర్స్‌ ఇన్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో స్పోరోసార్సినా పాశ్చరీ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం ద్వారా తీవ్ర తాపం వల్ల ఇటుకల్లో కలిగే పగుళ్లను నివారించవచ్చని పరిశోధకులు నిరూపించారు. ఇందుకోసం వారు బ్యాక్టీరియా ద్రావకాన్ని, గోరుచిక్కుడు మొక్కలతో తయారుచేసిన జిగురును, చంద్రునిపై లభించే మట్టిలాంటి పదార్ధాన్ని ఉపయోగించి ఇటుకలు తయారుచేశారు. ఈ ప్రక్రియలో ఉపయోగించిన బ్యాక్టీరియా ఆ ఇటుకల తయారీలో ఉపయోగించిన కార్బొనేట్‌ను కాల్షియం కార్బొనేట్‌గా మారుస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు