ఎన్నికల ఫలితాలకు ముందు పినరయ్ విజయన్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బయోలో మార్పులు

సీఎం పినరయ్ విజయన్ సోషల్ మీడియాలో తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన తన అఫిషియల్ ఎక్స్‌ అకౌంట్‌ బయోలో మార్పులు చేశారు. రాష్ట్ర పేరును 'కేరళం'గా మార్చడం చర్చనీయాంశమవుతోంది.

New Update
Pinarayi Vijayan

Pinarayi Vijayan

మరికొన్ని గంటల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం పినరయ్ విజయన్ సోషల్ మీడియాలో తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. ఆయన తన సోషల్ మీడియా బయోలో మార్పులు చేశారు. బయోలో.. పొలిట్ బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అని మార్చారు. సీఎం పేరును తీసివేయడంతో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. 

Also Read: బ్రిజ్‌భూషణ్ అడ్డాలో రెజ్లింగ్ పోటీ.. 'నాకేమైన జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత'.. వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు

కేరళ ఎన్నికల్లో మెజార్టీ సర్వేలు ఈసారి UDF కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి LDF కూటమి ఓడిపోతుందనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బయో మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేరళ పేరు అంశం కూడా చర్చనీయాంశమవుతోంది.  మలయాళీ ప్రజల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. 

Also Read: రేపే ఎన్నికల ఫలితాలు.. 5 రాష్ట్రాల్లో హై అలెర్ట్

అయితే కేరళ పేరు మార్పు కోసం ఇప్పటికే రాష్ట్ర, కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఇప్పుడు ఈ అంశం పార్లమెంటరీ ప్రక్రియలో ఉంది. త్వరలోనే అధికారికంగా పేరు మార్పు అమలులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు