/rtv/media/media_files/2026/04/21/pappu-yadav-2026-04-21-18-46-46.jpg)
Pappu Yadav faces notice after claiming women need ‘leaders’ bedrooms’ to enter politics
బిహార్(bihar) కు చెందిన పుర్నియా ఎంపీ పప్పు యాదవ్(Pappu Yadav) వివాదంలో ఇరుక్కున్నారు. మహిళల రాజకీయ ప్రవేశంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో మహిళల ప్రవేశంపై మాట్లాడుతూ.. " 90 శాతం మంది మహిళలు ఏ రాజకీయ నాయకుడి రూమ్‌కి వెళ్లకుండా తమ రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టలేరు'' అని వ్యాఖ్యానించారు. సమాజంలో మహిళలలపై దోపిడి పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులు మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.
'Women start careers in men's bedrooms... 90% female Netas start this way.'
— Tuhin A. Sinha तुहिन सिन्हा (@tuhins) April 21, 2026
Despicable,outrageous comments by Pappu Yadav,abusing self made women politicians. Will @priyankagandhi sack this obnoxious misogynist or does she endorse his views?Disgusting ppl pic.twitter.com/7PDBhp5Nrv
Also Read: దేశంలో భారీగా పతనమైన ఎరువుల ఉత్పత్తి ..కేంద్రం కీలక నిర్ణయం
Pappu Yadav Faces Notice After Claiming Women Need Leaders
పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా, వాళ్ల నైతికతను ప్రశ్నించేలా ఎంపీ హోదాలో వ్యక్తి మాట్లాడటంపై మండిపడుతున్నారు. 70 శాతం మంది నేతలు అశ్లీల వీడియోలు చూస్తుంటారని.. వీళ్లలో అణగారిన కులాల మహిళలకు రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం ఉండటం లేదని పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: తమిళనాడులో, పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీలదే అధికారం.. సంచలన సర్వే
ఈ వ్యవహారంపై బిహార్ ప్రభుత్వం, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తీవ్రంగా ఖండించాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పప్పు యాదవ్ మాట్లాడారంటూ ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పప్పు యాదవ్ చేసిన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Follow Us