Indian Army: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాలని యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖను దాటేందుకు యత్నిస్తుండగా.. ఏడుగురు చొరబాటుదారులను హతమార్చాయి.

New Update
Indian Army

Indian Army

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాలని యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖను దాటేందుకు యత్నిస్తుండగా.. ఏడుగురు చొరబాటుదారులను హతమార్చాయి. మృతుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో కృష్ణ ఘాటి సెక్టార్‌లో ఫిబ్రవరి 4-5 మధ్యరాత్రి వేళ ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.    

Also Read: బీజేపీ తమ అభ్యర్థులను లాక్కోవాలని చూస్తుందన్న కేజ్రీవాల్‌.. ఎల్జీ సంచలన నిర్ణయం

పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ నియంత్రణ రేఖను దాటి భారత ఫార్వర్డ్‌ పోస్ట్‌పై దాడికి యత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం మెరుపుదాడికి పాల్పడింది. కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. మృతుల్లో ముగ్గురు పాకిస్థానీ ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు తెలిపాయి. ఇక మిగతా వారు ఉగ్రవాదులని.. వాళ్లు అల్‌-బదర్ గ్రూప్‌నకు చెందినవారై ఉంటారని చెప్పాయి.   

Also Read: మనుషులా మానవ మృగాలా.. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిని ఇద్దరు కీచకులు.. ఛీ ఛీ!

అయితే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ శాంతి మంత్రం చెప్పిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది.  కశ్మీర్‌తో పాటు అన్ని సమస్యలను భారత్‌తో సంప్రదింపులు చేసి పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఓ కార్యక్రమంలో అన్నారు. మరోవైపు జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు తాజాగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌(POK)లో  కశ్మీర్ సంఘీభావ దినం పేరుతో సంయుక్త సదస్సు నిర్వహించినట్లు సమాచారం. అంతేకాదు దీనిపై హమాస్ కూడా హజరైనట్లు ప్రచారం నడిచింది. ఈ క్రమంలోనే భారత భద్రతా దళాలు అలెర్ట్ అయ్యాయి.   

Also Read: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..!

Advertisment
Advertisment
Advertisment