Food Poison: పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్.. 400 మందికి అస్వస్థత

గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో ఏకంగా 400 మంది ఫుడ్‌ పాయిజన్‌ వల్ల అస్వస్థతకు గురయ్యారు.

New Update
Over 400 fall ill after suspected food poisoning at wedding in gujrat

Over 400 fall ill after suspected food poisoning at wedding in gujrat

గుజరాత్‌(gujarat) లోని దాహోద్‌ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో ఏకంగా 400 మంది ఫుడ్‌ పాయిజన్‌ వల్ల అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. వీళ్లలో 60 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అభ్లోద్‌ అనే గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి విందు భోజనం తర్వాత 11 గంటల సమయంలో పెళ్లికి వచ్చిన అతిథులు అస్వస్థకు గురయ్యారు. 

Also Read: మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే పురుషుల బెడ్రూంలోకి వెళ్లాల్సిందే.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Food Poisoning At Wedding In Gujrat

ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు రావడంతో అక్కడున్న వాళ్లందరూ భయాందోళనకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు బాధితులకు స్థానిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. సమాచారం మేరకు ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఆ గ్రామానికి చేరుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు. అయితే పెళ్లి విందులో ఇచ్చిన మామాడి రసం తాగడం వల్లే అతిథులు అస్వస్థకు గురయ్యారని అధికారులు భావిస్తున్నారు. 

Also Read: దేశంలో భారీగా పతనమైన ఎరువుల ఉత్పత్తి ..కేంద్రం కీలక నిర్ణయం

మరోవైపు ఈ ఘటనపై కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని గుజరాత్‌ ఆహార కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పెళ్లి విందులో వడ్డించిన ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. అయితే దర్యాప్తులో దోషులుగా తేలిన వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని FSSAI హెచ్చరించింది. 

Advertisment
తాజా కథనాలు