China HMPV Virus: చైనాని ఇప్పుడు కొత్తరకం వైరస్ వణికిస్తుంది. అదే హ్యుమన్‌మోటాన్యూమో వైరస్(Human Metapneumovirus HMPV Virus). షార్ట్ గా HMPV వైరస్ అంటున్నారు. ఇప్పుడు ఈ వైరస్ సోకి చైనాలోని చాలా మంది ప్రజలు ఆసుపత్రుల పాలై చికిత్స పొందుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిని ఈ వైరస్ ఎటాక్ చేస్తుంది. అంటు వ్యాధిగా వ్యాపిస్తున్న ఈ వైరస్ ప్రధాన లక్షణం శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించడమే. దీనిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం చాల ప్రయత్నాలు చేస్తుంది. Also Read: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్‌డేట్.. ఐఎండీ కీలక ప్రకటన China is ready to suffer with another virus #hmpvvirus #HMPV pic.twitter.com/5lCyGUzc42 — vyas laxminarayana(lakhan vyas) (@lakhan586) January 3, 2025 అయితే ఈ వైరస్ గురించి భారత్ లోని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, భయాందోళన చెందవద్దని డీజీహెచ్‌ఎస్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ )ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ వెల్లడించారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. " చైనాలో మెటాప్‌న్యూమో వైరస్ వ్యాప్తి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వైరస్(China HMPV Virus) సాధారణ జలుబుకు కారణమయ్యే ఇతర శ్వాసకోశ వైరస్‌లాగా ఉంటుంది పెద్దవారిలో, చిన్నవారిలో ఇది ఫ్లూకి కారణం కావచ్చు " అని డాక్టర్ గోయల్ వెల్లడించారు. Also Read: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్ రా బాబు! China is ready to suffer with another virus #hmpvvirus #HMPV pic.twitter.com/5lCyGUzc42 — vyas laxminarayana(lakhan vyas) (@lakhan586) January 3, 2025 Also Read: కట్టలు తెంచుకున్న 20ఏళ్ల నాటి వైరస్.. చైనా నుంచి జపాన్‌కు.. నెక్ట్స్ ఇండియాకు? దగ్గు జలుబు ఉంటే.. చలికాలంలో ఇలాంటి వైరస్ ఇన్‌ఫెక్షన్లు వ్యాపిస్తాయన్న గోయల్ .. ఎవరికైనా దగ్గు జలుబు ఉంటే అలాంటి వారు మిగితా వారిని కలవకపోవడం మంచిదన్నారు. తద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందదని ఆయన అభిప్రాయపడ్డారు. దగ్గు, తుమ్ము వచ్చే సమయంలో ప్రత్యేకంగా టవల్ ను ఉపయోగించాలని ఆయన సూచించారు. జలుబు, జ్వరం ఉంటే అవసరమైన మందులు తీసుకోవాలని.. ఇప్పుడున్న పరిస్థితి గురించి మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. Also Read : కియా కొత్త కారు సైరోస్ ఎస్‌యూవీ బుకింగ్స్ స్టార్ట్