BIG BREAKING: కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. DMK సంచలన ప్రకటన

తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. 

New Update
BREAKING

BREAKING

తమిళనాడులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే ప్రకటించింది. ఇండియా కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లలో గెలిచినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది సభ్యుల మెజార్టీ బలాన్ని అందుకోలేకపోయింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ అయిదు స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ సపోర్ట్ చేసింది. ఈ నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. 

తమ కూటమి అండతో ఎన్నికల్లో గెలిచి.. ఫలితాలు రాగానే మారిపోయి వెన్నుపోటు పొడిచారంటూ కాంగ్రెస్‌పై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు