Bihar: నితీశ్ కుమార్ రాజీనామా !.. బిహార్ కొత్త సీఎం ఎవరంటే ?

బిహార్‌లో మొదటిసారిగా బీజేపీ సర్కార్‌ ఏర్పాటు కానుంది. సీఎం నితీశ్ కుమార్ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం బిహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
nitish kumar

Nitish Kumar set to resign today

Bihar: బిహార్‌లో మొదటిసారిగా బీజేపీ సర్కార్‌ ఏర్పాటు కానుంది. సీఎం నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం 11 గంటలకు చివరి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ అనంతరం సీఎం పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత లోక్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌కు రాజీనామా లేఖను అందజేయనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు పాట్నాలో NDA శాసనసభ పక్ష మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. 

ప్రస్తుతం బిహార్ డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీ హైకమాండ్ కూడా ఈయనే సపోర్ట్ ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సామ్రాట్‌కు సీఎం పదవి దక్కకుంటే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మంగళవారం సాయంత్రం నాటికి బిహార్ కొత్త సీఎం ఎవరనేది తెలియనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు. 

Also Read: ఏప్రిల్ 14 న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి...ఆయన గురించి కొన్ని ఆసక్తికరం అంశాలు

బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలుండగా అందులో ఎన్డీయేకి 202 మంది సభ్యుల బలం ఉంది. అందుకే డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీకి కొత్త సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక నితీశ్‌ కొడుకు నిశాంత్‌ను కూడా కొత్త మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ నుంచి బిహర్‌కు మొదటిసారిగా సీఎం వస్తుండటంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇదిలాఉండగా గతేడాది నవంబర్‌లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో 202 సీట్లు దక్కించుకుంది. ఆర్జేడీ 25 సీట్లకే పరిమితమైపోయింది. కాంగ్రెస్‌ కేవలం 6 స్థానాల్లోనే గెలిచింది. ఈసారి అధికారంలోకి రావాలని పట్టుబడ్డ విపక్ష కూటమి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీలు ఇచ్చినప్పటికీ అవి ఫలించలేకపోయాయి. 

Also Read: TCS నాసిక్‌ క్యాంపస్‌లో లవ్‌జిహాద్‌.. ఏడుగురు ఉద్యోగులపై వేటు

Advertisment
తాజా కథనాలు