2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను (Income Tax) విధానంలో సంస్కరణలు చేసేందుకు ముందుకొచ్చింది. వచ్చేవారం ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Also Read: పదివేల మంది విద్యార్థులకు రీసెర్చ్ ఫెలోషిప్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?
ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ'' ముందు విశ్వాసం తర్వాతే పరిశీలన అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చేవారం కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నాం. ఈ బిల్లు వల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయ పన్ను నిబంధనల్లో సగానిపై తగ్గిస్తాం. అలాగే టీడీఎస్, టీసీఎస్‌ను కూడా క్రమబద్ధీకరిస్తామని'' వివరించారు.
Also Read: మన దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీక్.. ఆర్థిక మంత్రి ఔట్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసా?
మరోవైపు వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. సీనియర్ సిటిజెన్స్‌కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్‌ను రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పెంచుతున్నామని తెలిపారు. మరోవైపు ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును కూడా పెంచారు. ఏదైనా మదింపు ఏడాదికి అప్‌డేటెడ్ రిటర్నులు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారమన్ చెప్పారు. అలాగే ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు సైతం టీసీఎస్‌ను మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: నేడే బడ్జెట్ విడుదల.. ఈసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే?