NEET 2026: నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో కీలక మార్పులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

నీట్ పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు వరుసగా జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. పరీక్ష విధానంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

New Update
Dharmendra Pradhan

Dharmendra Pradhan

నీట్‌యూజీ 2026(NEET 2026) పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ నీట్ పరీక్షను మళ్లీ జూన్ 21న నిర్వహిస్తామని తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. 2024లో జరిగిన నీట్‌ పేపర్ కూడా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా వరుసగా పేపర్లు లీక్ అవుతున్న ఘటనలు జరగడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. పరీక్ష విధానంలో పారదర్శకతను పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

Also Read :  హర్మూజ్ జలసంధిని దాటిన రెండు భారతీయ LPG నౌకలు

NEET To Be Fully Computer-Based From Next Year

మరోవైపు మే 3న జరిగిన నీట్‌ పేపర్ లీక్‌పై ప్రస్తుతం సీబీఐ విచారణ చేస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న బాధ్యులను విడిచిపెట్టమన్నారు. దోషులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూన్‌ 21న నిర్వహించబోయే రీటెస్ట్‌ కోసం విద్యార్థులు నచ్చిన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇస్తున్నామని చెప్పారు. జూన్ 14న అడ్మిట్ కార్డులు రిలీజ్ చేస్తామన్నారు. ఇందుకోసం అభ్యర్థులు మళ్లీ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 

లక్షలాది మంది విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. అందుకే పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో నీట్‌పై వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని అభ్యర్థులకు సూచించారు. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎన్టీఏ కఠినంగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీ మూలాలను త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు.

Also Read :  ఢిల్లీలో వర్క్‌ ఫ్రం హెం.. సీఎం రేఖా గుప్తా 10 కీలక ప్రకటనలు

Advertisment
తాజా కథనాలు