/rtv/media/media_files/2026/05/22/neet-2026-fee-refund-process-2026-05-22-12-45-24.jpg)
NEET 2026 fee refund process
మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల మళ్లీ ఆ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు తమ పరీక్ష ఫీజును క్లెయిమ్ చేసుకునేందుకు మే 21, 2026న ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు పేర్కొందిNEET 2026 fee refund process
. మళ్లీ పరీక్ష రాసే అభ్యర్థులు కొత్తగా ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన neet.nta.nic.in లో లాగిన్ అయ్యి, తమ చెల్లుబాటు అయ్యే బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించడం వల్ల రీఫండ్‌ను పొందవచ్చు.
Also Read: పుల్వామా పాపానికి ముగింపు.. పీవోకేలో కరడుగట్టిన ఉగ్రవాది హతం!
నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని తెలుస్తోంది. అభ్యర్థుల సౌకర్యార్థం, వారు ఒకవేళ ఇల్లు మారినా లేదా చిరునామాలో మార్పులు జరిగినా కూడా తమ ప్రస్తుత చిరునామాను, పరీక్ష కేంద్రాన్ని అప్‌డేట్ చేసుకునేందుకు NTA అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 21న రాత్రి 11:50 గంటల లోపు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ మార్పులు చేసుకోవచ్చు. కానీ నగర ఎంపికలు, అక్కడున్న పరీక్ష కేంద్రాల లభ్యతను బట్టి, ఈసారి కేటాయించే పరీక్షా కేంద్రం మునుపటి కేంద్రం కన్నా భిన్నంగా ఉండే ఛాన్స్ ఉందని ఏజెన్సీ స్పష్టం చేసింది.
Also Read: వేడెక్కుతున్న భూమి.. రాబోయేది సాధారణ వేసవి కాదు, 'సూపర్ ఎల్ నినో' కాలమే!
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని మార్చుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ.. దరఖాస్తు ప్రక్రియ సమయంలో ఎంచుకున్న పరీక్షా మాధ్యమాన్ని మార్చుకునేందుకు ఎలాంటి పర్మిషన్ లేదు. అభ్యర్థులు ఫీజు రీఫండ్ ప్రక్రియ, పరీక్ష కేంద్రం ప్రాధాన్యత అప్‌డేట్, అడ్మిట్ కార్డ్ విడుదల, పునఃపరీక్ష షెడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ ఉండాలని అధికారులు సూచించారు.
Follow Us