MRF Tyres: గత ఏడాది నుంచి ఎంఆర్‌ఎఫ్ (MRF) స్టాక్ షేర్లు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈ కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ఠానికి చేరాయి. మంగళవారం రూ.1,12,400కి పడిపోయింది. గతేడాది స్టా్క్‌తో పోలిస్తే దాదాపు 20 శాతం ప్రతికూల రాబడి వచ్చింది. ఈ షేరు కేవలం ఒక్క నెలలోనే దాదాపు 14 శాతం పడిపోవడం గమనార్హం. షేరు గరిష్ఠంగా రూ.40,000 దిగువకు పడిపోయింది. ఇలా షేర్లు పడిపోవడానికి గల ప్రధాన కారణం ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు సరిగాలేకపోవడమే. అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్ కూడా గత 4 నెలలుగా క్షీణతలోనే ఉంది. దీనివల్ల MRF మార్కెట్ క్యాప్ రూ.48 వేల కోట్లకు పడిపోయింది.
MRF కంపెనీ షేర్ల భారీ పతనం..
ఇక వివరాల్లోకి వెళ్తే 2024 జనవరిలో ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్ షేర్ల ధరలు రూ.1.50 లక్షలు దాటాయి. ఒకప్పుడు ఈ కంపెనీ షేర్ ధర అత్యంత ఖరీదుగా ఉండేది. కానీ ఇప్పుడు భారీ పతనం కారణంగా దీని షేరు ధర రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేర్ మొదటి స్థానంలో ఉంది . దీని షేర్ విలువ ప్రస్తుతం రూ.1,37,010 లక్షలుగా ఉంది. MRF కంపెనీ టైర్ల ప్రపంచానికి రారాజుగా మారడానికి ముందు ఈ సంస్థ వ్యవస్థాపకుడు మమ్మెన్ మాప్పిళ్ళై బెలూన్లు తయారు చేసేవారు.1946లో ఆయన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.
Also Read: పది నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ డెలివరీ.. బ్లింకిట్ న్యూ సర్వీస్
మద్రాసులోని తిరువొత్తియూర్‌లో చిన్న షెడ్డులో బెలూన్‌ల తయారీ వ్యాపారం ప్రారంభించారు. ఎక్కువగా పిల్లల బొమ్మలతో పాటు పారిశ్రామిక చేతి తొడుగులు, రబ్బరు పాలు ఉత్పత్తులను తయారు చేసేవారు. కాలక్రమేణా ఆయన తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు.1952లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (MRF)ని స్థాపించారు. ట్రెడ్ రబ్బర్ తయారీ వ్యాపారంలోకి ప్రవేశించిన 4 సంవత్సరాల్లోనే కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. 1956 నాటికి MRF 50 శాతం వాటాతో భారతదేశంలో ట్రెడ్ రబ్బర్ మార్కెట్ లీడర్‌గా మారింది.
Also Read: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
1961 నవంబరులో ఈ సంస్థకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హోదా వచ్చింది. ఆ తర్వాత మాన్స్‌ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీ సహకారంతో ఆటోమొబైల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ అలాగే సైకిళ్ల కోసం టైర్లు, ట్యూబ్‌లను తయారు చేసింది. 1965లో కంపెనీ తన మొదటి విదేశీ వెంచర్ ద్వారా అమెరికాకి టైర్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది. 80వ దశకంలో భారతీయ ఆటోమొబైల్ రంగంలో పెద్ద మార్పు వచ్చింది. అందుబాటు ధరలో కార్లు వచ్చాయి. దానికి ఉదాహరణ మారుతీ 800. అదే సమయంలో ద్విచక్ర వాహనాల పరిశ్రమలు కూడా 1985లో ఊపందుకున్నాయి. దీంతో ఎంఆర్‌ఎఫ్ కంపెనీ ద్విచక్ర వాహనాల కోసం టైర్లను తయారు చేయడం ప్రారంభించింది. అలా క్రమంగా ఎదుగుతూ ట్రక్, కార్, బైక్-స్కూటర్ టైర్లను తయారుచేయడంలో ఈ సంస్థ అగ్రగామిగా మారింది.
Also Read: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా ?
రెండు దశాబ్దాల క్రితం అంటే 2004 ఆగస్టు 6న MRF షేర్ ధర రూ.1548 ఉండేది. క్రమంగా దీని ధర పెరుగుతూ వెళ్లింది. 2010 నాటికి షేరు ధర 5,000లు దాటింది. ఆ తర్వాత 2012లో రూ.10,000 దాటగా, 2015 నాటికి మరింత ఊపందుకుని రూ.44,922కి చేరింది. దీని తరువాత, ఈ స్టాక్ రికార్డు పెరుగుదలతో కొత్త రికార్డులను సృష్టించింది. ఇక 2024 జనవరిలో దీని షేర్ ధర రూ.1.50 లక్షలు దాటింది. అయితే ఆ తర్వాత నుంచి దీని షేర్ ధరలు పడిపోతూ వస్తున్నాయి. తాజాగా మంగళవారం రూ.1,12,400కి పడిపోయింది.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!