PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

త్వరలో ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తాడని శివసేన (యూబీటీ) MP సంజయ్ అన్నారు. అది చెప్పడానికే RSS ప్రధాన కార్యాలయానికి ఉగాది రోజు వెళ్లారని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తర్వరలో బీజేపీ కొత్త ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తోందని సంజయ్ రౌత్ చెప్పారు.

New Update
Modi

శివసేన (యూబీటీ) కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ సెప్లెంబర్‌లో రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నారని ఆయన చెప్పారు. అందుకే ఆయన సడెన్‌గా ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సంజయ్ రౌత్ అన్నారు. గత పదేళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి మోడీ ఎప్పుడు వెళ్లలేదు.. కానీ ఆయన ఆకస్మికంగా ఈరోజు ఎందుకు వెళ్లారని సందేహం లేవనెత్తారు. తనకు ఉన్న సమాచారం మేరకు.. ఆర్ఎస్ఎస్ దేశ నాయకత్వంలో మార్పు కోరుకుంటుంది. ఇక ప్రధాని మోడీ కాలం ముగిసిందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీ వారసుడిని త్వరలోనే ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తోందన్నారు. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రధాని మోడీ పీఎం హోదాలో తొలిసారి 2025, మార్చి 30న మహారాష్ట్ర నాగ్‎పూర్‎లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు ప్రధాని మోడీ నివాళులర్పించారు. RSS రూల్ ప్రకారం బీజేపీ నాయకుల్లో 74ఏళ్లు పైబడిన వారు ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదని నిబంధన ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోదీకి 74వ సంవత్సరం నడుస్తోంది. సెప్టెంబర్ 17న మోదీ 75వ పుట్టిన రోజు. దీంతో ఆర్ఎస్ఎస్ ఆయనచేత ప్రధాని పదవికి రాజీనామా చేయిస్తోందని సంజయ్ రౌత్ అన్నారు. గతంలో ఎల్‌కే అద్వానీ ప్రధాని పదవి అధిరోహించాల్సి ఉండే.. ఆయనకు 74ఏళ్ల పైబడి వయసు ఉందని 2014లో నరేంద్ర మోదీని బీజేపీ అధిష్టానం ప్రధానిగా ప్రకటించింది. 

Also read: BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన

బీజేపీ ప్రధాని విషయంలో ఆర్ఎస్ఎస్ రూల్‌ను సంజయ్ రౌత్ లేవనెత్తారు. లోక్‌సభ టర్మ్ ప్రకారం మోదీ ప్రధానిగా మరో నాలుగేళ్లు కొనసాగే అవకాశం ఉంది. కానీ మధ్యలోనే బీజేపీ మరో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీ సెప్టెంబర్‎లో రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నారని.. ఆ విషయం చర్చించడానికే ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‏ను కలిసి మోదీ విడ్కోలు చెప్పడానికే మోడీ ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లారని ఆరోపించారు. 

పదవి విరమణ గురించి మాట్లాడేందుకే ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వచ్చాడన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ప్రధాని మోడీ ఇప్పట్లో రిటైర్ కారని.. ఇంకా చాలా సంవత్సరాలు దేశాన్ని పాలిస్తారని కౌంటర్ ఇచ్చారు. 2029లో మనం మళ్ళీ మోడీని ప్రధానమంత్రిగా చూస్తామని.. ఇప్పుడే ఆయన వారసుడి కోసం వెతకాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

ఆర్ఎస్ఎస్ భారతదేశ సాంస్కృతిక, సైద్ధాంతిక వారసత్వాన్ని సూచించే మహా వృక్షం అని అభివర్ణించారు. అలాగే.. నాగ్‎పూర్‎లో దివంగత RSS చీఫ్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ అలియాస్ గురూజీ జ్ఞాపకార్థం స్థాపించిన మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‎కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 

#rss #rss-meet #shiv-sena #latest-telugu-news #pm modi #modi retirement plan #MP sanjay Raut
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు