/rtv/media/media_files/2025/02/22/QQvjNHL1W3UHzWlnb9Bi.jpg)
Maha Kumbh Mela
Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj, Uttar Pradesh)లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది మంది భక్తులు అక్కడికి పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) కీలక విషయాలు వెల్లడించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య త్రివేణి సంగమంలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా శక్తిని ప్రపంచమంతా కీర్తిస్తోందని కొనియాడారు.
Also Read: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన
మన రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధిపై నమ్మకం లేనివాళ్లు కుంభమేళాపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారంటూ విమర్శలు చేశారు. వాస్తవానికి మహాశివరాత్రి లోపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నామని.. కానీ అంతకన్నా ముందే తమ అంచనాలకు మించి భక్తులు కుంభమేళాకు వచ్చారని పేర్కొన్నారు. 144 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకు ఇది కొనసాగనుంది. తొలుత 40 నుంచి 45 కోట్ల మంది ఇక్కడికి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ కుంభమేళా క్రేజ్ ప్రపంచం నలుమూలలకు వెళ్లిపోయింది. దీంతో నిత్యం దాదాపు కోటిన్నర మంది ఇక్కడికి వస్తున్నారు.
Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!
ఏకంగా 8 కోట్ల మంది...
అయితే జనవరి 29న మౌని అమవాస్యం సందర్భంగా ఏకంగా 8 కోట్ల మంది వచ్చినట్లు యూపీ ప్రభుత్వం చెప్పింది. ఈ కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. దీంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఇటీవల ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Also Read: దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్!
Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్!