BREAKING: దేశంలో LPG కొరతలు.. సిలిండర్ల లారీ దొంగతనం

చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగలు LPG సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేయడం కలకలం రేపుతోంది. ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

New Update
More than 500 filled LPG cylinders stolen in Uttar pradesh

More than 500 filled LPG cylinders stolen in Uttar pradesh

మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు ధరలు పెరిగిపోతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేతతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. భారత్‌లో కూడా ఈ ప్రభావం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్‌లు మూసివేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సరిపడా నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. 10 శాతం LPG ఉత్పత్తి పెంచినట్లు పేర్కొంది. చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 

Also Read: మోదీ సర్కార్ డబుల్ ధమాకా.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కొందరు దుండగలు LPG సిలిండర్లతో ఉన్న ట్రక్కును దొంగతనం చేయడం కలకలం రేపుతోంది. ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ ట్రక్కులో రూ.18 లక్షల విలువైన 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్కు కోసం వెతికారు. చివరికి ఖాళీ ట్రక్కు కనిపించడంతో దొంగతనానికి గురైన సిలిండర్ల కోసం గాలిస్తున్నారు. 

Also Read: బంగ్లాదేశ్‌కు భారత్ భరోసా.. పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ సప్లై

ఆ ట్రక్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్లాంట్‌కు అనబంధంగా పనిచేస్తోంది. మార్చి 2న ట్రక్కు సిలిండర్ల లోడ్‌తో కాస్పూర్‌ దేహత్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ హోలీ పండుగ నేపథ్యంలో డ్రైవర్ ఆ ట్రక్కును ప్లాంట్ బయటే ఉంచేసి ఇంటికి వెళ్లిపోయాడు. చివరికి మార్చి 6న ఆ ట్రక్కు పారీచా దగ్గర్లోనే హైవే పక్కన కనిపించాయి. అందులో ఒక్క సిలిండర్ కూడా కనిపించలేదు. అంతేకాదు లారీలో GPSను కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం పోలీసులు చోరీకి గురైన సిలిండర్లు వెతికేందుకు ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisment
తాజా కథనాలు