/rtv/media/media_files/2025/01/14/kVApQP0zMlFd3eSgF8P4.jpg)
Russia Army
రష్యాలో భారతీయులపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. తాజాగా అక్కడ కేర యువకుడు చనిపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఇక నెమ్మదిగా ఉంటే లాభం లేదనుకుంది. అందుకే వెంటనే ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం అధికారులో మాట్లాడింది భారత విదేశాంగ శాఖ. మాస్కోలో రష్యన్ అధికారులతో కూడా ఫోన్‌లో సంప్రదించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను వెంటనే విడిపించాలని డిమాండ్ చేశారు. వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశాం అని భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది.
Also Read: మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్
ఒకరు చనిపోగా..మరొకరికి తీవ్ర గాయాలు..
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కేరళ యువకుడు మరణించాడు. ఇతను రష్యా సైన్యంలో పని చేస్తున్నాడు. కేరళ కు చెందిన టిబీ బినిల్ గా అతనిని గుర్తించారు. బినీల్ వయసు 32 ఏళ్ళు. ఇతని సమీప బంధువు కూడా యుద్ధంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. టీకే జైన్ అతని పేరు అని చెబుతున్నారు. బినిల్‌కు పెళ్ళయింది. అతని భార్య కేరళలోనే ఉంటారు. అతను చనిపోయిన విషయం తెలిసి బినీల్ భార్య షాక్‌కు గురయ్యింది. ఆయన్ను రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని వాపోయారు. త్రిశ్శూరుకు చెందిన బినీల్, జైన్‌లు ఐటీఐ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశారు. ఎలక్ట్రిషయన్లు, ప్లంబర్లుగా పనిచేయడానికి వారిద్దరూ ప్రైవేటు వీసాతో గతేడాది 4న రష్యాకు వెళ్ళరు. కానీ అక్కడకు వెళ్ళగానే వారి పాస్‌పోర్టు రద్దు చేసింది రష్యా. దాని తరువాత మిలటరీ సపోర్టు సర్వీస్‌లో భాగంగా యుద్ధంలోకి దింపింది. తమను తమ దేశానికి తీసుకెళ్ళాలని బినీల్, జైన్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆలోపునే బినీల్ చనిపోయారు.
Also Read: Kallakkadal: కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు...