/rtv/media/media_files/2025/01/14/Di7W2XXJfbt2MQHlx8y5.jpg)
jukar berg Photograph: (jukar berg)
లోక్ సభ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నిషికాంత్ దూబే మెటా సంస్థ సీఈఓ మార్క్‌తో పార్లమెంట్, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఇటీవల మెటా సీఈవో మార్క్‌జూకర్ బర్గ్ ఓ పోడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని అన్నారు.
Also Read: దేవుళ్లు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగితే.. కుంభమేళ ఎందుకొచ్చిందంటే..?
జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. జూకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని పేర్కొన్నారు. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని గుర్తుచేశారు. ఇదే విషయంలో జుకర్ బర్గ్‌కు ఇండియన్ పార్లమెంట్ నోటీసులు పంపింది. అవాస్తవాలు చెప్పినందుకు మెటా సీఈఓ భారత పార్లమెంట్‌కు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ ప్యానల్ సమన్లు పంపింది. జో రోగన్ నిర్వహించిన ఓ పోడ్‌కాస్ట్ షోలో జుకర్ బర్గ్ ఈ వివాదాస్పద వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
Also Read: USA: మస్క్ చేతికి టిక్‌టాక్...అమ్మే ఆలోచనలో చైనా
ప్రపంచంలో ఎన్నికల పోకడల గురించి చర్చించారు. ఆ సందర్భంలోనే కోవిడ్ 19ని సరిగా నిర్వహించనందుకే ప్రపంచంలో భారత్‌తో సహా అన్నీ దేశాల్లో ఆ టైంలో అధికారంలో ఉన్న పార్టీలకు అధికారం ఎన్నికలప్పుడు సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ మాటలను బీజేపీ నాయకులు తప్పుబట్టారు.