Maoist: మావోయిస్టుల మరో దారుణం.. ఇన్‌ఫార్మర్ నెపంతో యువకుడి హత్య!

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లా తర్రేం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగి చెరువుకు చెందిన కారం రాజును హతమార్చారు. అలాగే మాడివి మున్నా గ్రామస్తులను కూడా కిడ్నాప్ చేసి హతమార్చినట్లు సమాచారం. 

New Update
maosit

Maoists killed police informer in Chhattisgarh

Maoist: ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లా తర్రేం పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడిగి చెరువు గ్రామానికి చెందిన కారం రాజును హతమార్చారు. అలాగే మాడివి మున్నా అనే గ్రామస్తులను ఇన్‌ఫార్మర్ నెపంతో కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సమాచారం. 

హతమార్చిన దగ్గర ఓ చెట్టుకు లేఖ..

ఈ మేరకు కేంద్ర బలగాల వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అలర్ట్ అయింది. దండకారణ్యంలోని పలు ప్రాంతాల్లో ఇన్ ఫార్మర్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించి హత మారుస్తుంది. కొంతమందికి ప్రజా కోర్టులో కఠిన శిక్షలు విధించి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ ఫార్మర్ల కారణంగానే పార్టీ నష్టపోతుందని భావిస్తున్న మావోయిస్టులు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పోస్టర్లు అంటిస్తు్న్నారు. కారం రాజును హతమార్చిన దగ్గర ఓ చెట్టుకు లేఖ అంటించిన మావోయిస్టులు.. ఇన్ ఫార్మర్లుగా ఎవరైనా పనిచేస్తుంటే మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే రాజుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి: Fire Accident In Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఇదిలా ఉంటే బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. గంగులూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పశ్చిమ బస్తర్‌లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు. శుక్రవారం నుంచి DRG, STF, కోబ్రా 202, CRPF 222 బెటాలియన్లు కలిసి స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించాయి. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్‌లో శనివారం మావోయిస్టులు పోలీసులపైకి అడపాదడపా కాల్పులకు పాలపడ్డారు. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వెస్ట్ బస్తర్ ప్రాంతంలో ఇంకా పెట్రోలింగ్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్యాసింజర్ పై మూత్ర విసర్జన చేశాడు. AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. జరిగిన దానికి ఆ వ్యక్తి ప్రయాణికుడిని క్షమాపణ కోరారు.

New Update
Air India flight 123

Air India flight 123

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI 2336 లోని బిజినెస్ క్లాస్‌లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ప్యాసింజర్ వికృత ప్రవర్తనకు ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ అసహించుకున్నారు. అయితే జరిగిన దానికి ఆ వ్యక్తి క్షమాపణలు కోరాడు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్‌లోని 2D సీటులో కూర్చుని సమీపంలో కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బాధిత ప్రయాణీకుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఫిర్యాదు చేయనప్పటికీ, నిందితుడు తన చర్యలకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ అధికారులు తెలిపారు. పక్క వ్యక్తిపై యూరిన్ పోసిన ప్యాసింజర్ పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అట. దీనిపై బ్యాంకాన్ వెళ్లాక కంప్లెయింట్ ఇస్తానని బాధిత ప్రయాణికుడు ఫ్లైట్ సిబ్బందికి తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment