Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

మార్చి 31 దంతేవాడ, బీజాపూర్ సరిహద్దులో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలిపింది. రేణుక అలియాస్ చైతెను వారం ముందు అరెస్టు చేసి హతమార్చినట్లు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరు మీద లేఖ విడుదలైంది.

New Update
maoist letter

Maoist party letter

Maoist: మార్చి 31 దంతే వాడ అండ్ బీజాపూర్ జిల్లా సరిహద్దులో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలిపింది. రేణుక అలియాస్ చైతెను వారం రోజులు ముందు అరెస్టు చేసి హతమార్చినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరు మీద లేఖ విడుదల చేశారు.

ఎన్‌కౌంటర్లకు శిక్ష తప్పదు..

ఈ మేరకు తీవ్రమైన అణిచివేత కారణంగా అనేక ముఖ్యమైన అంశాలపై సకాలంలో స్పందించలేకపోయామని మావోయిస్టు లేఖలో పేర్కొన్నారు. రేణుక అలియాస్ చైతేకు మావోయిస్టు పార్టీ తరఫున విప్లవ జోహార్లు తెలిపారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లకు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. 

ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పులు.. వరంగల్‌ మహిళా మావోయిస్టు మృతి

ఇదిలా ఉంటే.. మావోయిస్టులు మరో సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో కాల్పులు నిలిపివేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. తాము కూడా కాల్పుల విరమణను పాటిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ ను స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. తాము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, జర్నలిస్టులకు, ఇతర సంఘాలకు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ ను చేపట్టాలని కోరారు.

ఇది కూడా చదవండి: Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!

chattisgarh | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment