/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
Maoists
Maoist Letter on Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ(Maoist Sensational Letter) విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో(Encounter) మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. మరణించిన 8 మందిలో నలుగురు గ్రామస్తులున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సమత, మావోయిస్టు డివిజన్ కమిటీ గంగ పేరుతో పోలీసులు నకిలీ ప్రెస్ నోట్ విడుదల చేశారని అధికారిక లేఖలో పేర్కొంది.
/rtv/media/media_files/2025/01/25/J7Xm66kdkKDy1AQ0BhyC.jpeg)
/rtv/media/media_files/2025/01/25/oOSIbHM5sYtB3XaNkSTW.jpeg)
8 వేల మంది పోలీస్ బలగాలు..
ఈ మేరకు శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ(Communist Party of India) దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సమత ప్రవక్త పేరుతో లేఖ విడుదల చేసింది. పోలీస్ శాఖ మావోయిస్టు పార్టీ పేరుతో ప్రకటనలు చేసి ప్రజల్లో సందేహాలు, నిరాశలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడింది. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర ఇంచార్జ్ కామ్రేడ్ దామోదర్ క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ పరిధిలోని సింగవరం, తుండేపల్లి, మల్లెంపేట పూజారి కాంకేర్ గ్రామాలపై 8 వేల మంది పోలీస్ బలగాలు దాడి చేసినట్లు తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరుతో యుద్ధం చేపట్టిన ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Hydra: కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. నల్లమల్లారెడ్డి 200 ఎకరాల్లో!
ఇదిలా ఉంటే.. మావోయిజం అంతం చేయాలనుకోవడం నీటిపై రాతలేనని పౌరహక్కుల సంఘం ఏపీ రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ అన్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన మావోయిస్టు చలపతి అంత్యక్రియలు నిర్వాహణ సందర్భంగా RTVతో మాట్లాడిన చంద్రశేఖర్.. ఈ నేలపై నక్సలిజం ఎన్నటికీ చావదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలాగే ఈ ఎన్ కౌంటర్లపై ప్రొఫెసర్ హరగోపాల్, పౌర హక్కుల నేత, అడ్వకేట్ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మానవ మారణహోమాన్ని సమాజం క్షమిందని అన్నారు.
ఇది కూడా చదవండి: Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ నటి.. బాధలో ఫ్యాన్స్
ఈ మేరకు ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దులో జనవరి 19న మావోయిస్టుల భారీ ఎన్‌కౌంటర్(Chhattisgarh-Orissa Encounter) జరిగింది. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఛత్తీస్ గఢ్ స్టేట్ కమిటీ సభ్యుడు చంద్రహాస్ అలియాస్ పాండు, చలపతి మరణించినట్లు పోలీసులు ఆధారాలతో సహా వెల్లడించారు. దీంతో అంతిమ యాత్రలో పాల్గొనేందుకు ఇరువురి గ్రామాలకు మావోయిస్టు సానూభూతి పరులు తరలివెళ్లారు. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి యాప్రాల్‌కు చెందిన చంద్రహాస్ నివాసం వద్దకు మావోయిస్టు సానుభూతి పరులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అంత్యక్రియల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ ఆర్టీవీతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?
ఇది కూడా చదవండి: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!