/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Hidma-Encounter-jpg.webp)
Maoist Hidma operation 125 villages in Police control
Maoist: మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే వరుస ఎన్ కౌటర్లు చేపిస్తోంది. గురువారం ఒక్కరోజే ఛత్తీస్ ఘడ్‌లో 30 మందిని చంపిన బలగాలు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కోసం భారీ ప్లాన్ వేశాయి. మద్వి హిడ్మా కోసమే 125కి పైగా గ్రామాలను చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతాల్లోనే హిడ్మా దాక్కున్నాడా..
గడిచిన 3 నెలల్లో 77 మందిని హతమార్చిన భద్రతా దళాలు.. నక్సలైట్ కమాండర్ హిడ్మా కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. హిడ్మాను వెతకడానికి 125కి పైగా గ్రామాల్లో సాంకేతిక మ్యాపింగ్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల థర్మల్ ఇమేజింగ్‌ను భద్రతా దళాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోనే హిడ్మా దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతాలలో నక్సలైట్ స్థావరాలు కూడా స్థాపించబడ్డాయని, భద్రతా దళాలు ఈ ప్రాంతాలలో ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసులకు ఇప్పటికే అన్ని మార్గాల గురించి సమాచారం కూడా అందిందని తెలుస్తోంది.
Also read : ముస్కాన్ కంటే డేంజర్ ... ప్రియుడితో కలిసి భర్తను లేపేసి సంచిలో
మరోవైపు గురువారం జరిగిన ఎన్ కౌంటర్ పై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. నక్సలైట్లపై సాధించిన ఈ విజయంతో ఏడాది మార్చి 31 లోపు నక్సల్ ఉగ్రవాదం అంతమవుతుందని దేశానికి హామీ ఇచ్చారు. 'నక్సల్ రహిత భారతదేశం ప్రచారం' దిశలో ఈ రోజు మన సైనికులు మరో పెద్ద విజయాన్ని సాధించారని ఆయన పోస్ట్ పెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకేర్‌లలో మన భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 30 మంది నక్సలైట్లు హతమయ్యారు.
Also read : ధనశ్రీ వర్మకు రూ. 4.75 కోట్లు భరణం.. ఇంతకీ చాహల్ ఆస్తులెంత?
(chattisaghad | hidma naxal leader | police | telugu-news | today telugu news | latest-telugu-news)