/rtv/media/media_files/2025/01/31/NNOIm3FWTozxEEyCHuRm.jpg)
Maoist Hidma daughter Vanjem Kesha surrender
Maoist Leader Hidma: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా కూతురు వంజెం కేషా(Vanjem Kesha) పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెపై రూ.4 లక్షల రివార్డు ఉన్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) తెలిపారు. ఇక చిన్నతనం నుంచే చైతన్య నాట్యమండలి(Chaitanya Natyamandali)లో పని చేసిన వంజెం కేషా.. 2021లో గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలిగా నియామకం అయింది. ఆ తర్వాత కొంతకాలానికి దళంలోనే రమేష్‌ను పెళ్లి చేసుకుంది.
Also Read: Trump-Musk:మస్క్ కుమారుడి అల్లరి వల్ల 145 సంవత్సరాల డెస్క్ మార్చేసిన ట్రంప్!
19 మంది లొంగుబాటు..
ఇదిలా ఉంటే ఇటీవలే భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కమాండర్ గా వ్యవహరిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ మొదటి బెటాలియన్ కు చెందిన ముగ్గురు సభ్యులున్నారు. పోరాడలేక అలసిపోయామని, సాధారణ జీవితం గడిపేందుకే లొంగిపోయినట్లు మావోయిస్టులు చెబుతున్నారు.
Also Read: Sankranthiki Vasthunam: మరో వారంలో టీవీలోకి సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. డేట్ ఫిక్స్
ఆపరేషన్ చేయూత..
ఈ మేరకు జనజీవన స్రవంతిలో కలిసే మావోలకు ఆపరేషన్ చేయూత పేరిట ప్రత్యేక సరెండర్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వారిలో సౌత్ బస్తర్ డీవీసీఎం నరోటి మనీష్ అలియాస్ ఆకాష్ ఉండగా అతనిపై రూ. 8లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. లొంగిపోయిన వారిలో పీఎల్జీఏ మొదటి బెటాలియన్ కు చెందిన మడివి నంద, మడివి హండా , మడివి హడమ సహా పలువురు సెంట్రల్ కమిటీ మెంబర్లకు గార్డుగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. నందా, హండాపై 4లక్షల రివార్డు ప్రకటించింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం.
Also Read: Operation Kagar : ఆపరేషన్ కగార్...100 మంది మహిళా మావోయిస్టులు హతం
Also Read: Punjab: 405 రోజులు... 10 దేశాలు... 41 లక్షల రూపాయలు.. చేరిన గమ్యం.. కానీ అంతలోనే!