TG News: మన్మోహన్‌కు ఘన నివాళి.. రేవంత్, కేటీఆర్, హరీష్ ఏమన్నారంటే!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని కేటీఆర్, హరీష్ సమర్ధించారు.

New Update
CM Revanth Reddy

Telangana cm revanth reddy

TG News: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సహనాన్ని కోల్పోలేదని కొనియాడారు. ఈ మేరకు సోమవారం మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి.. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టిసారించారని గుర్తు చేశారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారని అన్నారు.

భారత రత్న ఇవ్వాలి..

ఆయనకు భారత రత్న ఇవ్వాలని చేసిన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్, కేటీఆర్ సైతం సమర్ధించారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారు. ఇది మాకు జీవిత కాలం గుర్తుండిపోయే సంఘటన. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేదలకు మేలు జరిగేలా చేశారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ అని ప్రశంసలు కురిపించారు. 

దశ-దిశను మార్చారు..


అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చారని, అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరం ఆయన తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ-దిశను మార్చాయన్నారు. దేశానికి ఆయన మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి.. కానీ తెలంగాణకు ఆయన ఆత్మబంధువు. తెలంగాణకు పురుడుపోసిన వ్యక్తిగా అయనను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలు చిరస్మరణీయం. దేశానికి ఆయన చేసిన సేవలకు మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నామన్నారు.

పార్టీలకు అతీతంగా ఏకాభిప్రాయం..


పార్టీలకు అతీతంగా మన్మోహన్ గారి పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన్మోహన్ సింగ్,  జైపాల్ రెడ్డికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్. అలాంటి ఆయనకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆయన విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సభ్యుల సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని మేం భావిస్తున్నామని చెప్పారు. 

మన్మోహన్ విగ్రహం.. 


శాసన సభలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన విధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత రత్న ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. మన్మోహన్ సింగ్ తో పాటు 15వ లోక్ సభలో 5 సంవత్సరాలు కలిసి పని చేయడం జరిగింది. ఆయన ఈ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు చేశారు. ఆయన హయంలో 42 మంది ఎంపీల్లో 33 మంది ఎంపీలకు కన్వీనర్ గా చేశానని అన్నారు. 

అలాగే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ది ఫీల్ పొందారని గుర్తు చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేశారు. ఆర్బిఐ గవర్నర్ గా కొత్త కొత్త చట్టాలు తెచ్చారు. బ్యాంకుల్లో అనేక సంస్కరణలు చేశారు. పీవీ నరసింహారావు హయంలో ఆర్థిక మంత్రిగా సంస్కరణలు చేశారు. 2004-14 మధ్య ప్రధానిగా దేశ రూపురేఖలు మార్చారు. అనేక పథకాలు, చట్టాలు తీసుకొచ్చారు. ఆహార భద్రత చట్టం, భూ సేకరణ చట్టం, స్ట్రీట్ వెండర్స్ చట్టం తెచ్చారు. బీసీ పార్లమెంటు సభ్యుడిగా కమిటీకి సభ్యుడిగా ఉన్న ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నాను. వారీ హయంలో కరీంనగర్ పార్లమెంటులో 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నామని కొనియాడారు. 

ఆర్థిక మంత్రి గా 1991-96 మధ్య మైనార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఆయన ఆర్థికపరమైన ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. ఇక పీవీ నరసింహారావు సెక్రటరీ మనోహ్మన్ సింగ్ కాల్ చేసి మీరు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నారని చెప్పారు. ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉండేదనీ ఆయన చెప్పారు. స్వయంగా పీవీ ఆయనను పిలిచి ఆర్థిక మంత్రి చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ఉపాధి హామీ చట్టం తెచ్చారు. ప్రభుత్వం పారదర్శకతపై తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. భూసేకరణ చట్టం, ఆహార భద్రత చట్టం తెచ్చారు.72 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశారు. అందులో 12 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి చేశారని గుర్తు చేశారు పొన్నం. 

అసమాన్య వ్యక్తి: హరీష్ రావు


ఇక మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గౌరవనీయులు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు సంతాపం తెలిపేందుకు సభా నాయకులు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తున్నమన్నారు. వారు పెద్దల సభలో 33 సంవత్సరాలు పనిచేశారని, ఈరోజు మన పెద్దల సభ శాసనమండలిలో కూడా వారికి నివాళులర్పిస్తే మరింత బాగుండేదన్నారు. ఎందుకు మండలిలో పెట్టలేదని చాలా మంది అడుగుతున్నారని, ఆయన మనమధ్య లేకపోయినా, వారి సేవలు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయన్నారు. సామన్య కుటుంబంలో పుట్టి, వీధి దీపాల మధ్య, లాంతర్లు పెట్టుకొని, స్కాలర్ షిప్ మీద ఆధారపడి చదువుకొని అసమాన్య వ్యక్తిగా ఎదిగారని, ఆర్థికశాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడిగా, దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్లారంటే, వారి క్రమశిక్షణ గలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనే పట్టుదలే కారణమన్నారు. 

లివింగ్- హై థింకింగ్: కేటీఆర్


స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తమ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మాపార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్  భారతరత్న ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.  మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోకి నేరుగా లేటరల్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆర్బిఐ ఈ పని చేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు. ప్రపంచం మొత్తం భారతదేశం గురించి వినాల్సి వస్తుంది. తన తొలి బడ్జెట్ ప్రసంగంలో భారత దేశ స్థితిగతులను 1991 లో తెలిపిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. భారతదేశం సింపుల్ లివింగ్- హై థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం. లాయాల్టీ నిబద్ధత అనేది ఈరోజున్న రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుందని ప్రశంసలు కురిపించారు కేటీఆర్. 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు