Mamata Banerjee: బెంగాల్ లో హైటెన్షన్.. అర్థరాత్రి వరకే ఛాన్స్.. మమత రాజీనామా చేయపోతే ఏం జరుగుతుంది?

పశ్చిమ బెంగాల్‌ మే 7 అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చట్టబద్ధమైన అధికారాలు కోల్పోనున్నారు. అయినప్పటికీ.. మమతా బెనర్జీ తాను సీఎంగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

New Update
Mamata benarjee

Mamata benarjee

పశ్చిమ బెంగాల్‌(west bengal) లో ఎన్నడూలేని విధంగా ఓ రాజకీయ సంక్షోభం తలెత్తింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయినప్పటికీ.. సీఎం పదవికి రాజీనామా చేసేదే లేదని మమతా బెనర్జీ తేల్చి చెబుతున్నారు. ప్రస్తుత బెంగాల్ అసెంబ్లీ పదవీకాలం మే 7వ తేదీ అర్ధరాత్రితో ముగిసిపోనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం.. అయిదేళ్ల పదవీకాలం ముగిశాక శాసనసభ దానంతట అదే రద్దవుతుంది. దీంతో మే 7 అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చట్టబద్ధమైన అధికారాలు కోల్పోనున్నారు. అయినప్పటికీ.. మమతా బెనర్జీ తాను సీఎంగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం.. ఎన్నికల్లో మెజార్టీని కోల్పోయిన సీఎం స్వచ్ఛందంగా తప్పుకోకపోతే.. వాళ్లని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోయినా మే 7తో ఆమె పదవీకాలం ముగిసిపోతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. అయితే మే 9న బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ రోజున బీజేపీ నేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం జరిగే వరకు ఈ మధ్యలో ఉండే ఒక రోజు అంటే మే 8న పశ్చిమ బెంగాల్‌ను ఎవరు నిర్వహిస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చే దాకా పాత సీఎంనే 'కేర్‌టేకర్'గా కొనసాగమని గవర్నర్ కోరడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ప్రస్తుత ఒడిదొడుకుల మధ్య గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది. 

Also Read: "దీదీ.. మీరు ఓడిపోలేదు".. మమతకు అఖిలేష్ యాదవ్ భరోసా

Mamata Banerjee Says Won’t Resign

మే 9న తమ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ ఇప్పటికే ప్రకటన చేసింది. అప్పటిదాకా రాష్ట్రంలో ఎలాంటి పరిపాలనాపరమైన శూన్యత తలెత్తకుండా గవర్నర్ తాత్కాలిక ఏర్పాట్లు చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికల సంఘం రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించింది. ఎలాంటి కీలక ఫైళ్లను తీసుకెళ్లరాదని గవర్నర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ మమతా బెనర్జీ తన మొండి వైఖరిని వదలకపోతే గవర్నర్ తన అధికారాలు ఉపయోగించి కొత్త అసెంబ్లీ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన పరిస్థితిగా నిలవనుంది.

మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ పార్టీ ఓడిపోలేదని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. SIR పేరుతో తమ ఓట్లు కాజేశారంటూ ఆరోపించారు. ఆమె చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అయితే మే 8వ తేదీన బెంగాల్ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటాయనేది ఆసక్తిగా మారింది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా గవర్నర్ జోక్యం చేసుకుని కొత్త సీఎం బాధ్యతలు స్వీకరించే దాకా మధ్యంతర వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: బెంగాల్ ఎన్నికల రక్త చరిత్ర.. ఒకటి కాదు రెండు కాదు.. వందలమంది దారుణ హత్య!

Advertisment
తాజా కథనాలు