/rtv/media/media_files/2026/04/21/mallikarjun-kharge-2026-04-21-16-19-53.jpg)
Mallikarjun Kharge Calls PM Modi as a Terrorist, BJP Demands Apology
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీని ఆయన ఉగ్రవాదితో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. AIDMK పార్టీ బీజేపీ నేతృత్వంలోని NDAతో కలిసి పోటీ చేయడంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు '' AIDMK పార్టీ మోదీతో ఎలా కలుస్తోంది ?. అతను ఒక ఉగ్రవాది. ఆయనకు సమానత్వంపై నమ్మకం లేదు. ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని నమ్మదు. ఇలాంటి వారితో ఏఐడీఎంకే కలుస్తోంది అంటే వీళ్లు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం'' అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
Chennai, Tamil Nadu: Congress President Mallikarjun Kharge says, "How can they (AIADMK) join with Modi? He is a terrorist. And he who won't believe in equality. His party won't believe in equality and justice. And these people are joining with them, it means that they are… pic.twitter.com/qymq7H54Z7
— IANS (@ians_india) April 21, 2026
Also read: కెనడా వెళ్లే భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింపు!
మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఖర్గే వెంటనే ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చివరికి తాను చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జు ఖర్గే వివరణ ఇచ్చారు. తాను మోదీని ఉగ్రవాది అనలేదన్నారు. ఆయన ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే అన్నానంటూ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఎప్పుడూ కూడా బెదిరింపులకు పాల్పడుతుంటారని అన్నారు. ఐటీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు ప్రధాని చేతుల్లోనే ఉన్నాయని తెలిపారు. ఆయన ప్రజలను భయపెడుతున్నారనే విషయాన్నే చెప్పానని.. ఉగ్రవాది అని అనలేదంటూ స్పష్టం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం అక్కడ పర్యటన చేస్తున్న ఖర్గే ప్రధానిపై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us