BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు

పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

New Update
Earthquakes

భారత్‌తోపాటు చుట్టుపక్కల దేశాల్లో వరుస భూకంపాలు వణుకు పుట్టిస్తున్నారు. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఇండియాలోని మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 2 గంటలకు భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో మరో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

శాస్త్రవేత్తలు బలూచిస్థాన్‌కు 65 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్, చైనా భారత్‌లోని మేఘాలయ, కోల్‌కత్తా, ఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలో ఇండియాలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని కూడా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment