/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
ACCIDENT
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నదియా జిల్లాలో వేగంగా వచ్చిన ఓ కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Also Read: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు!
అయితే ఈ రిక్షా డ్రైవర్లు ఈద్ వేళ షాపింగ్ చేసి ఇంటికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. '' రోడ్డుపై వేగంగా వస్తున్న ఎస్‌యూవీ వరుసగా మూడు ఈ రిక్షాలు ఢీకొంది. ఇందులో ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది గాయాలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని'' పోలీసులు వివరించారు.
Also read: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు!
అలాగే ప్రమాదం జరిగిన అనంతరం ఘటన స్థలంలోనే డ్రైవర్ కారు వదిలేసి పారిపోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో...
Also Read: అమ్మాయి వలపు వలలో పడి.. పాకిస్థాన్‌కు మిలటరీ సీక్రేట్స్ లీక్