Fetus-in-Fetu Case: ఇది 8వ వింత! యువతి కడుపులో బిడ్డ.. ఆ బిడ్డ కడుపులో మరో బిడ్డ!

మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. బుల్దానా జిల్లాకు చెందిన 32ఏళ్ల మహిళా గర్భంలోని బిడ్డ కడుపులో మరో పిండం కనిపించడంతో అందరూ కంగుతిన్నారు. దీనిని 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పిలుస్తారు. ప్రమాదం లేదు. కవలలు ఏర్పడే క్రమంలో ఇలా జరుగుతాయని వైద్యులు తెలిపారు. 

New Update
Health Tips: మొదటి సారి తల్లి కాబోతున్నారా..అయితే ఈ చిట్కాలతో మీ ప్రయాణాన్ని సులభతరం చేసుకోండి!

Maharastra Fetus-in-Fetu Case

Fetus-in-Fetu Case: మహిళల గర్భంనుంచి సాధారణంగా కవలలు లేదంటే ముగ్గురు, నలుగురికిపైగా పిల్లలు పుట్టడం చూశాం. అయితే తాజాగా ఓ యువతి కడుపులో బిడ్డ మరి కొన్ని నెలల్లో పురుడుపోసుకునేందుకు సిద్ధమవుతుండగా వైద్య పరీక్షల్లో డాక్టర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఈ వింత ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. 

బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది..

ఈ మేరకు బుల్దానా జిల్లాకు చెందిన 32 ఏళ్ల యువతి గర్భం దాల్చింది. ఇందులో భాగంగా ప్రతీ నెల వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటోంది. అయితే తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఎప్పటిలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లిన ఆమెకు డాక్టర్లు కళ్లు చెదిరిపోయే న్యూస్ చెప్పారు. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్  ప్రసాద్ అగర్వాల్ చెప్పారు. 9 నెలలు నిండే వరకు ఏ ఒక్క స్కానింగ్‌లో ఈ విషయం బయటకు రాలేదని గైనకాలజిస్ట్ వెల్లడించారు. తాజాగా చేసిన సోనోగ్రఫీ స్కానింగ్‌లో పిండాన్ని గుర్తించినట్లు చెప్పారు. 'స్కానింగ్ ఫొటోలు చూసి ఆశ్చర్యమేసింది. పరీక్షించి చూస్తే తప్ప పిండం ఉన్నట్లు అర్థం కాలేదు. మరో ఇద్దరు గైనకాలజిస్టులకు ఫొటోలు పంపి వారి సూచనలు కూడా తీసుకున్నాం. ఆ పిండం పెద్దగా అభివృద్ధి చెందలేదు. బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది'  అని వివరించారు.  

ఇది కూడా చదవండి: Manchu Mohan Babu: గుజరాత్లో ప్రత్యక్షమైన మోహన్ బాబు, విష్ణు.. సీఎంతో మీటింగ్.. ఎందుకో తెలుసా?

ఇక దీనిని 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పిలుస్తారని, కవలలు ఏర్పడే క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ప్రత్యేక సంరక్షణ అవసరముందని డాక్టర్ ప్రసాద్ అగర్వాల్ చెప్పారు.  ఈ అరుదైన కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 200 నమోదైనట్లు తెలిపారు. ఇండియాలో 20 మందిలో ఇలాంటి సమస్యలలు తలెత్తినట్లు చెప్పారు. ఇక ఈ వార్త వినగానే సదరు మహిళతోపాటు ఆమె కుటుంబమంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం వింత, తమకే ఇలా ఎందుకు జరిగిందనే గందరగోళంలో జాతకాలు చూపించడంతోపాటు దీనికి పరిష్కారం చూపించాలని వైద్యులను కోరారు.  

ఇది కూడా చదవండి: TG: తెలంగాణలో మరో దారుణం.. వేరే వ్యక్తితో పొలాల్లో కనిపించిన తల్లి.. చూసి తట్టుకోలేక కొడుకు ఏం చేశాడంటే!?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!

కర్ణాటకలో దారుణం జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధించాడు. నిద్రిస్తుండగా ఆమె పక్కనే నిలబడి పదేపదే టచ్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.

New Update
Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం, మంచి మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నా.. వంద మందిలో ఉన్నా.. పాడు బుద్దితో అతి నీచంగా, అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. గతం కంటే ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. 

Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతిపై కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆ యువతి పక్కనే నిలబడి.. చేతులతో టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కండక్టర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కామ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

నిద్రపోతున్న యువతిపై

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతి నిద్రపోతుంది. అదే సమయంలో బస్సు కండక్టర్ ఆమె పక్కకి వచ్చి నిలబడి ఆ యువతిని పదేపదే టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ఆమె కూర్చున్న సీట్‌ పక్కనే నిల్చుని మెల్ల మెల్లగా చెయ్యి వేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణీకుడు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అది కాస్త రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేఎస్ఆర్టీసీ అధికారులు ఆ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. 

Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

viral-news | viral-video | crime news
Advertisment
Advertisment
Advertisment