/rtv/media/media_files/2024/10/19/9JeHZSXXQtQO9UZk5NWu.jpg)
Lucknow court imposes Rs 200 fine on Rahul Gandhi
సావర్కర్‌పై ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నోకోర్టు షాక్ ఇచ్చింది. నోటీసులు జారీ చేసినా కోర్టుకు హాజరు కాకపోవడంతో రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న మరోసారి అటెండ్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సావర్కర్‌పై రాహుల్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
రాహుల్‌కు సమన్లు జారీ..
బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారు. ఆ తర్వాత తన చర్యలకు క్షమాపణ చెప్పారు. దీంతో మహాత్మాగాంధీ ఇతర స్వాంతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరుగార్చారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. దీంతో చరిత్రను రాహుల్ గాంధీ వక్రీకరించారంటూ విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే న్యాయవాది నృపేంద్ర పాండే కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిటిషన్ పై విచారణ చేపట్టిన లక్నో కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. 2025 జనవరి10న హాజరు కావాలని లక్నో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
అయితే పలు కారణాల రిత్యా రాహుల్ గాంధీ కోర్టులో హాజరు కాలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాలని సూచించింది. అప్పుడు కూడా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేస్తామని స్పష్టం చేసింది.
Also read : చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం