/rtv/media/media_files/2026/04/03/lok-poll-predicts-a-decisive-mandate-for-udf-in-kerala-2026-04-03-21-49-08.jpg)
Lok Poll predicts a decisive mandate for UDF in Kerala
కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్ (LDF), విపక్ష యూడీఎఫ్ (UDF) మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలపై 'లోక్ పోల్' సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. ఈసారి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అధికారంలోకి రానుందని ఈ సర్వే వెల్లడించింది. మార్చి 16 నుంచి 31 మధ్య సేకరించిన శాంపిల్స్ ఆధారంగా.. కేరళ ఓటర్లు ఈసారి మార్పును కోరుకుంటున్నట్లు లోక్ పోల్ సర్వే స్పష్టం చేసింది.
Also Read: ఆ దేశంలో మళ్లీ లాక్ డౌన్...కరోనా కాదండోయ్..ఎందుకో తెలుసా?
సీట్ల అంచనాలు
లోక్ పోల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. UDF కూటమి 42-44 శాతం ఓట్ల షేర్‌తో సుమారు 77 నుండి 81 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ప్రస్తుత అధికార కూటమి LDF 39-41 శాతం ఓట్లతో 58-62 సీట్లకే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి కేరళలో పాగా వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయినప్పటికీ ఈ కూటమికి కేవలం 14-16 శాతం ఓట్లతో 1 లేదా 2 స్థానాలకే పరిమితం కానుంది. కేరళలో ఎన్నికలప్పడు ప్రభుత్వ మార్పు దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ 2016, 2021లో రెండుసార్లు వరుసగా LDF అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి మాత్రం కేరళ ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నట్లు లోక్‌పోల్ సర్వే వెల్లడించింది.
Lok Poll predicts a decisive mandate for UDF in Kerala.
— Shantanu (@shaandelhite) April 3, 2026
UDF: 77–81 seats | 42–44% 🔥
This reflects the continuous efforts of the Congress-led UDF under the leadership of Rahul Gandhi. UDF is heading towards 100+
Keralam will win, UDF will lead.✊ https://t.co/2w7mrZnBv9
Also Read: అమెరికా యుద్ధ విమానాలు నేటమట్టం.. పైలట్ కోసం ఇరాన్ గాలింపు
ఇదిలాఉండగా కేరళతో పాటు అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో ఈసారి NDA ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లోక్ పోల్ సర్వే వెల్లడించిన ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అధికార కూటమి మాత్రం ఈ అంచనాలను తిప్పికొడుతోంది. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్ళీ అధికారాన్ని అప్పగిస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈసారి కేరళ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే.
Follow Us