Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్‌ ఉందబ్బా!

తమిళనాడులో ఓ వ్యక్తి ఒక్క నిమ్మకాయను సుమారు రూ.6 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం.అసలు నిమ్మకాయను అంత ధరకు ఎందుకు కొన్నారు..కొనాల్సి వచ్చింది అనే విశేషాలు ఈ కథనంలో...

New Update
lemon

lemon

మార్కెట్లో  నిమ్మకాయ మహా అయితే ఎంత ఉంటుంది ఓ  రూ.5 వరకు ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉండే వేసవికాలంలో రూ.10లకు అమ్ముతుంటారు. కానీ, ఇక్కడ ఓ నిమ్మకాయ ధర అక్షరాలా ఆరు లక్షలు. అవును ఇది నిజమే. వేలంలో ఓ నిమ్మపండు ఏకంగా రూ.5.9 లక్షలకు అమ్ముడుపోయింది. అయితే ఇది మార్కెట్‌లో కాదండోయ్. తమిళనాడులోని ఓ ఆలయం ఉత్సవాల్లో జరిగిన వేలంలో ఓ భక్తుడు దీనిని దక్కించుకున్నారు. పూజలోని ఈ నిమ్మకాయలను కొనేందుకు భక్తులు ఎగబడతారు. ప్రారంభ ధరే వేలల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ నిమ్మకాయ ఇంటిలో ఉంటే అంతా శుభమే జరుగుతుందని బలంగా నమ్ముతుంటారు.

Also Read: Indian illegal immigrants: మరో 119 మందితో అమెరికా నుంచి బయల్దేరిన విమానం..ఈ సారి ల్యాండింగ్‌ ఎక్కడంటే!

వివరాల్లోకి వెళ్తే.. పుదుకోట్టై జిల్లా తిరువరంగుళం వల్లనాట్టు చెట్టియార్‌ వంశీయులు తైపూస ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలు ముగిసిన మర్నాడు నుంచి మూడు రోజులు పాటు పళనిలో బస చేసి... పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుబ్రమణ్య స్వామి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా దాదాపు 300మందికి పైగా చెట్టియార్‌ సామాజికవర్గం పళనికి వెళ్లి తైపూస ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. మూడు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నాం, రాత్రి అన్నదానం చేసేటప్పుడు, దర్శనం సమయంలో ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజలు చేశారు.

Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!

అభిషేక నిమ్మకాయ...

ఈ క్రమంలో ఆ నిమ్మకాయలను పళని పెరియనాయకి అంబాల్‌ ఆలయం వద్ద నిమ్మకాయలను వేలం వేశారు. అయితే, కేవలం చెట్టియార్ వర్గీయులు మాత్రమే వేలంలో పాల్గొంటారు. అన్నదాన సమయంలో పూజలో పెట్టిన ఒక్కో నిమ్మకాయ రూ.16వేలు- రూ.40వేల వరకు ధర పలికాయి. తైపూసం రోజున పళని సుబ్రమణ్యస్వామి వద్ద పూజలో ఉంచిన అభిషేక నిమ్మకాయను దక్కించుకోడానికి ఆ వంశీయులు పోటీపడ్డారు. వారిలో ఒకరు ఏకంగా రూ.5.9 లక్షలకు వేలంలో పాడి సొంతం చేసుకున్నారు. స్వామివారి పాదాల చెంతన ఉంచిన నిమ్మకాయను ఇంటిలో పెట్టుకుంటే అంతా శుభాలు చేకూరుతాయనే నమ్మకంతో లక్షలు పెట్టేందుకు వెనుకాడలేదు.

కాగా, గతంలోనూ తమిళనాడులోని ఆలయాల్లో నిమ్మకాయలను లక్షలు కొనుగోలు చేసిన ఘటనలు ఉన్నాయి. విల్లుపురం ఆలయంలో గతేడాది ఉతిరమ్ పండుగ సందర్భంగా నిమ్మకాయలను వేలం వేయగా..ఓ భక్తుడు 9 నిమ్మ పండ్లను రూ.2.36 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. సంతానం లేని దంపతులు ఈ పండుగ సందర్భంగా మురుగన్ ఆలయాన్ని సందర్శించి వేలంలో నిమ్మకాయలను కొంటారు.

Also Read:Hyderabad: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌...ఆ ఏరియాల్లో తాగునీరు బంద్‌..ఎన్ని రోజుల పాటు అంటే!

Also Read: Indigo Valentines Day Sale: లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్

మందెస్తే దేనికైనా సిద్ధం అంటారు మందుబాబులు. తాజాగా అదే జరిగింది. ఓ వ్యక్తి ఫుల్‌గా మందేసి ఏకంగా పెద్ద సాహసమే చేశాడు. తన సైకిల్‌కి రోడ్ రోలర్‌కి రబ్బరుసూప్‌ని కట్టి లాగాడు. ఎంత తొక్కిన సైకిల్ కదల్లేదు, రోడ్ రోలరు కదల్లేదు. ఆ వీడియో వైరల్‌గా మారింది.

New Update
drunk man pulled road roller with his bicycle

drunk man pulled road roller with his bicycle

మందు బాబులం మేము మందు బాబులం.. మందేస్తే మాకు మేమె మహారాజులం. ఈ సాంగ్ వినగానే మందుబాబుల తఢాకా ఏంటో అర్థం అయిపోతుంది. నిజంగా మందుతాగే వారిని ఆ సమయంలో ఎవ్వరూ ఆపలేరు. తమకు తామే రాజులుగా ఊహించుకుంటారు. ఆ టైంలో భూమ్మిద కాకుండా.. ఆకాశంలో తేలుతున్నట్లు ఫీలౌతుంటారు. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

తమను ఎవరూ ఏమీ చేయలేరని కాలర్ ఎగరేస్తారు. కొండలనైనా పిండిచేసేంత బలం తమకు ఉందని భుజాలు గజాలు చేస్తుంటారు. కొందరైతే నడి రోడ్డుమీదే రచ్చ రచ్చ చేస్తారు. ఎదురుగా వస్తున్న వాహనాలను అడ్డుకుని బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తుంటారు. తాగిన మందు దిగేంత వరకు నింగి నేల కానరాదు. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మందుబాబు డేరింగ్

 

ఫుల్‌గా మందేసిన ఓ వ్యక్తి ఏకంగా సైకిల్‌తో పెద్ద ప్రయత్నమే చేశాడు. తన సైకిల్‌కు రోడ్ రోలకు పెద్ద రబ్బరుసూప్ కట్టి దాన్ని లాగడం స్టార్ట్ చేశాడు. ముందుగా ఆ మందుబాబు సైకిల్ ఎక్కి తొక్కడం ప్రారంభించాడు. వెనుకున్న రోడ్ రోలర్ ఎప్పటికీ ముందుకు  రాకపోవడంతో మరింత గట్టిగానే ప్రయత్నించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. మనోడు వేసిన మందు పేరు కనుక్కోండిరా జర.. మనం కూడా ట్రై చేద్దాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు