/rtv/media/media_files/2025/01/29/k1wO5gJgSvEuZQ02vYEX.jpg)
KumbhMela stampede issue Allahabad High Court sensational verdict
BIG BREAKING: మహా కుంభమేళా తొక్కిసలాటపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ దర్యాప్తు అవసరంలేదంటూ ప్రధాన న్యాయమూర్తి అరుణ్ భసాలి ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది అన్యాయమైనది, నిరాధారమైనది అని పేర్కొంది. దీంతో యోగి ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం కలిగింది.
ఖచ్చితమైన ఆధారాలు లేవు..
ఈ మేరకు ఇటీవల జరిగిన మహా కుంభమేళాలో తొక్కిసలాట సంఘటనలను సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ యోగేంద్ర పాండే, ఇతరులు ప్రజా ప్రయోజనాల కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించగా.. ప్రధాన న్యాయమూర్తి అరుణ్ భసాలి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని, పిటిషన్‌లో ఎలాంటి ఖచ్చితమైన కారణాలు లేదా ఆధారాలు సమర్పించలేదని కోర్టు స్పష్టం చేసింది.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
2025 మార్చి 11న ఈ కేసుపై మొదటిసారి విచారణ జరపగా.. కోర్టు తమ నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అయితా సోమవారం మార్చి 17న కోర్టు తుది విచారణ చేపట్టి పిటిషన్ తిరస్కరించింది. 2025 మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి చాలా మంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాల కోసం వేచి ఉన్న భక్తులపై వెనకవైపు భక్తులు పడటంతో తొక్కిసలాట జరిగింది. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు