Maha Kumbh Stampede: ఆ క్షణంలో ఏం జరిగిందంటే.. కుంభమేళా తొక్కిసలాట బాధితుల కన్నీటి కథ

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. ఆ సమయంలో అక్కడే ఉన్నవారి వారి మాటల్లో ఆ భయానక పరిస్థితులను మీడియాతో వివరించారు. అసలు బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టూగా ఫుల్ ఆర్టికల్ పై క్లిక్ చేసి చదవండి.

author-image
By K Mohan
New Update
kumbhamela stmeped

kumbhamela Stampede Photograph: (kumbhamela stmeped)

Maha Kumbh Stampede: అక్కడ చనిపోయిన వారి అడ్రస్ ఫ్రూప్‌ కూడా గల్లంతూ.. 30మంది మృతుల్లో 19 మంది వివరాలు మాత్రమే పోలీసులు గుర్తించారు. ఒకే రోజు 10 కోట్ల మంది ఒకే చోటకు చేరడం అంటే ప్రపంచంలోనే అదో పెద్ద మ్యాస్ గ్యాదరింగ్ అవుతుంది. దీని కోసం 10 వేల ఎకరాల్లో 80వేల టెంట్లు వేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భారీగా ఏర్పాటు చేసింది. 12 కిలో మీటర్ల మేరా భక్తులు స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేసింది. అయినా సరే తొక్కిసలాట చోటుచేసుకుంది. భక్తులు అందరూ ఒకేచోటకు చేరకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లు ధ్వంసమవ్వడంతో ప్రమాదం జరిగింది. కాశీకి పోయినా కర్మ తప్పదు అనే సామెత కుంభమేళాలో తొక్కిసలాట ఘటనతో నిరూపితమైంది. అసలు జనవరి 29 తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య ఏం జరిగిందో లైవ్‌లో అక్కడున్న వారి మాటలు ఓ సారి విద్దాం.. 

ఇది కూడా చదవండి: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

మోని అమావాస్య రోజు కుంభమేళాలకు 10 కోట్ల మంది అమృతస్నానాలు ఆచరించడానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. అమావాస్య రోజు అమృత గడియల కంటే ముందు స్నానం చేయడం ఎంతో పుణ్యంగా భావిస్తారు. అందుకోసమే జనవరి 29 తెల్లవారు జామున 1 గంటకే అఖారా ఘాట్‌లోకి చేరుకున్నారు భక్తులు.  

ఇది కూడా చదవండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

గుంపుగా వచ్చి తోసేశారు..

కర్ణాటకకు చెందిన విద్య సాహు అనే భక్తురాలు తొక్కిసలాట జరిగినప్పుడు భయానక క్షణాలు మీడియాతో చెప్పింది. మేము నుడుచుకుంటూ ముందుకు వెళ్తుండగా.. వెనుక నుంచి కొందరు గుంపుగా వచ్చి తోసి.. వారితో కలిపి చుట్టుముట్టి తీసుకెళ్లారు. వారికి ఎదురుగా ఓ స్తంభం ఉంది. అక్కడే అందరం ఇరుక్కు పోయామని విద్య సాహు చెప్పింది. 

ఇది కూడా చదవండి: Ambati Rambabu: అవును మాకు దిమాక్ లేదు.. కక్కిన కూటికోసమే కక్కుర్తి: అంబటి సంచలన కామెంట్స్!

అదృష్టశాత్తూ తొక్కిసలాట నుంచి బయటపడ్డ జై ప్రకాశ్ స్వామి..

అదే గుంపులో చిక్కుకున్న మరో వ్యక్తి జై ప్రకాష్ స్వామి తొక్కిసలాట నుంచి బయట పడ్డాడు. అదృష్టశాత్తూ అతని కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుకున్నాడు. జై ప్రకాశ్ మాట్లాడుతూ.. మేము గుంపులో ఇరుక్కుపోయాము. అఖారా ఘాట్ దగ్గరకు చేరుకోగానే అక్కడంతా గందరగోళంగా ఉంది. 

పెద్ద శబ్దమైందని వెనక్కి తిరిగి చూడగా... 

డియోరియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడే ఉన్నాడు. ఆ రోజు రాత్రి అకరా ఘాట్‌లో జరిగిన దాన్ని చెప్తూ.. స్నానం చేయడానికి రెడీ అవుతుండగా వెనుక నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపింది. వెనక్కి తిరిగి చూశాడు. పక్కనే ఉండాల్సిన తన భార్య పూనమ్ దేవి తప్పిపోయిందని అతడు గ్రహించాడు. జనం భయంతో పరుగులు పెడుతున్నారు. ఈ గంధరగోళంలో ఎంత వెతికినా ఆమె కనిపించలేదు.

అమ్మమ్మ తప్పిపోయింది..

బీహార్‌కు చెందిన ఓ యువతి ప్రయాగ్‌రాజ్ సంగమ్‌లో స్నానం చేస్తున్నప్పుడు తొక్కిసలాట సంభవించిందని చెప్పింది. దీంతో ఆమె అమ్మమ్మ(52) కనిపించకుండా పోయింది. యువతి గంటల తరబడి ఆమె కోసం వెతుకింది. అక్కడ అంబులెన్స్ సైరన్, అధికారుల హడావిడా, బాధితుల ఆర్తనాధాలు ఆమెను భయాందోళనకు గురి చేశాయి. అక్కడంతా కోలాహలంగా ఉందని యువతి మీడియాతో చెప్పింది.

ఇది కూడా చదవండి: Cannibals: ఆకలి తట్టుకోలేక పిల్లలను పీక్కు తింటున్న మనుషులు.. 1300 మందికి పైగా మైనర్లు!

మృతుల్లో బెలగావికి చెందిన నలుగురు

కర్ణాటకలోని బెలగావికి చెందిన నలుగురు తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో ఉన్నారు. జ్యోతి హర్తర్వాడ్ (50) ఆమె కూతురు మేఘా హత్తర్వాడ్(16), మహాదేవి భావనూర్, అరుణ్ కోపర్డే. జ్యోతి హత్తర్వాడ్ మరియు ఆమె కుమార్తె మేఘ జనవరి 26న ఒక ప్రైవేట్ ట్రావెట్ ఏజెన్సీతో 11 మందితో బయలుదేశారు. తోటి ప్రయాణికుల్లో చిదంబర్ పాటిల్ అనే వ్యక్తి జ్యోతి భర్తకు ఫోన్ చేసి తొక్కిసలాటలో అతని భార్య, కుమార్తె చనిపోయారని చెప్పారు. 

మధ్య ప్రదేశ్ నుంచి ఇద్దురు, ఒడిస్సా నుంచి ఒకరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు