Kumbh Mela: బోట్‌వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

కుంభమేళాలో పడవలు నడిపి పింటూ మహారా అనే వ్యక్తి రూ.30 కోట్లు సంపాధించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సంపాధించిన రూ.30 కోట్లలో 12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపింది. దీంతో పింటూ ఫ్యామిలీ షాక్ అయ్యింది.

New Update
pintu boat business

pintu boat business Photograph: (pintu boat business)

మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర దిశ మారిపోయింది. ప్రయాగ్‌రాజ్ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన కోట్ల మంది భక్తల కారణంగా ఆ రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. బోట్లు నడిపే ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిన విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్ని డబ్బుల వచ్చాయంటే ఐటీ అధికారులు ఖాళీగా ఉంటారా ఇగ.

ఆ కుటుంబానికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ శాఖ షాక్‌ ఇచ్చింది. రూ.30 కోట్లు సంపాధించుకున్నందుకు.. 12.8 కోట్లు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పింటూ మహరా కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. మహా కుంభమేళా జరిగిన 45 రోజులు త్రివేణీ సంగమానికి పడవలు నడిపిన ఈ కుటుంబం దాదాపు రూ. 30 కోట్లు సంపాదించింది.

Also read: Padma Awards: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

Also read: Starbucks : తంతే స్టార్‌బగ్స్‌లో పడ్డాడు.. డెలవరీ బాయ్‌కి రూ. 434 కోట్ల నష్టపరిహారం

ఐటీ అధికారులు పింటూ సంపాదన గురించి తెలుసుకుని ఐటీ చట్టంలోని 4, 68 సెక్షన్ల కింద రూ.12.8 కోట్ల పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో పింటూ కుటుంబం మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. ఈ విషయంలో సెబీ రిసెర్చ్‌ అనలిస్ట్‌ ఏకే మంధన్‌ ఎక్స్‌ వేదికగా ఐటీ అధికారులను ప్రశ్నించారు. ఐటీ శ్లాబ్‌లు, నిబంధనల గురించి ఏమీ తెలియని పింటూ సంపాదించిన సొమ్ములో ఖర్చులు పోను ఇక మిగుల్చుకున్నదేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పింటూకు వచ్చిన పబ్లిసిటీనే అతని పాలిట శాపంగా మారింది. కుంభమేళాకు ముందు పింటూ దగ్గర 60 బోట్లు మాత్రమే ఉండేవి. ప్రయాగ్‌రాజ్ రద్దీని అంచనా వేసి 70 బోట్లు అప్పు చేసి కొన్నాడు. అందుకోసం ఇంట్లో నగలు, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ

ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ కీలక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా పక్క దేశాలైప చైనా, పాకిస్తాన్ లతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పాక్ తో శాంతి కోసం ప్రయత్నిస్తే..నమ్మకద్రోహం ఎదురైందని మోదీ అన్నారు. 

New Update
podcost

PM Modi Podcost

లెక్స్ ఫ్రిడ్ మన్ తో ప్రధాని మోదీ చేసిన పాడ్ కాస్ట్ ఈరోజే రిలీజ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది సంచలనం సృష్టిస్తోంది. ఈ పాడ్ కాస్ట్ లో ప్రధాని మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన పొరుగు దేశాలు అయిన చైనా, పాకిస్తాన్ ల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో శాంతి కోసం ప్రయత్నాలు చేసినప్పుడల్లా శతృత్వం, నమ్మక ద్రోహమే ఎదురయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఇస్లామాబాద్‌ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

తాను చాలాసార్లు పాకిస్తాన్ తో స్నేహబంధం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేశానని...కానీ అటువైపు నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదని...పైగా మోసమే ఎదురైందని ప్రధాని మోదీ అన్నారు. 2014లో తాను మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించానని..కానీ రాలేదని చెప్పారు. ఇప్పటికీ తాను స్నేహం కోసం ప్రయత్నం చేస్తున్నానని...నిర్ణయం మాత్రం వారి చేతుల్లోనే ఉందని మోదీ చెప్పారు. శాంతి మార్గానని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. ఇరుదేశాల ప్రజలూ ఎంతో కాలంగా శాంతి కోసం ఎదురు చూస్తున్నారు. గొడవలు, యుద్ధాలతో అందరూ అలిసిపోయారు. ఉగ్రవాద దాడుల్లో ఎంతో మంది అమాయకులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో జీవితాలు నాశనమయ్యాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. 

చైనాతో పోటీయే ఉంటుంది..

చైనాతో మాత్రం ఎప్పటికీ తమ దేశానికి పోటీయే ఉంటుందని చెప్పారు ప్రధాని మోదీ. కానీ ఇరు దేశాలు ఆరోగ్యకరమైన పోటీతత్వంతోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానని అన్నారు. తాను ఎప్పుడూ విభేదాలు రాకుండా చూడాలనే అనుకుంటానని...చర్చలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పోటీ తత్వం ఉండాలి కానీ...అది ఘర్షణలకు దారి తీయకూడదని మోదీ అన్నారు.  ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని ప్రధాని మోదీ అన్నారు. 

Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

Also Read: బోట్‌వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

Advertisment
Advertisment
Advertisment