Sanjay Roy: మనిషిని చంపితే అది నేరం కాదా..? అత్యాచారం చేస్తే తప్పుకాదా..? తప్పే కానీ.. ఉరిశిక్ష మాత్రం వేయలేమని సీల్దా కోర్టు, అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ చెప్పారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నేరస్థుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలని ఈ కేసు విచారణ చేసిన సీబీఐ న్యాయమూర్తిని కోరింది. అయితే అందుకు జస్టిస్ అనిర్బన్ దాస్ అరుదైన (రేరెస్ట్ ఆఫ్ రేర్) కేసుల్లో ఒకటి కాదని చెప్పారు. అసలు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అంటే ఏంటి?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నేరస్తుడికి మరణశిక్ష పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ.. విఛిత్రంగా సీల్దా కోర్టు 2025 జనవరి 20న సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై వెస్ట్ బెంగాల్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో సంజయ్ రాయ్ అనే పోలీస్ వాలెంటీర్ ఓ ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, గొంతు నులిపి చంపేశాడు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ విచారించింది.
Also Read: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్
నేరం క్రూరంగా, దోషపూరితంగా ఉంటేనే ట్రయల్ కోర్టుకు ఉరిశిక్ష విధించే అధికారం ఉంది. ఆ నేరం అరుదైనదిగా ఉందని హైకోర్టు(High Court) నిర్థారించాలి. నేరస్తుడు చేసింది పెద్ద తప్పు, క్రూరత్వం ఉండాలని ప్రమాణాలు ఉన్నాయి. అసాధరణ నేరం అయ్యింటేనే మరణ శిక్ష విధిస్తారని కోర్టులు చెబుతున్నాయి. చేసిన తప్పుు బహిరంగ అసహ్యం, అతని శిక్ష కోసం సమాజం డిమాండ్ చేయాలి. 2008లో కసబ్ ఉగ్రదాడి, 2012లో నిర్భయ కేసు, తాజాగా కేరళలో ఓ యువతి ప్రియుడిని చంపిన కేసులో ఉరిశిక్ష విధించారు. అయితే ఇవన్నీ అరుదైన నేరులు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైపై తుపాకులతో దాడి చేసి పెద్ద ఎత్తున మారణహోమానికి సూత్రధారి కసబ్(Kasab)కు ముంబై ప్రత్యేక కోర్టు 2010లో ఉరిశిక్ష ఖరారు చేసింది. ముంబైలో(Mumbai) జరిపిన కాల్పుల్లో దాదాపు 160 మంది పౌరులు కన్నుమూశారు. మరో 300 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులపై జరిగిన ఆపరేషన్‌లో ముంబై పోలీసులు, ఎన్‌ఎస్‌జి, ఎస్‌పిజిలకు చెందిన 10 మందికి పైగా సైనికులు మరణించారు. ఎరవాడ జైలులో లష్కరే తోయిబా కసబ్‌ను ఉరితీసింది. ఈ కేసులో మరో నలుగురికి జీవిత ఖైదు విధించింది.
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు
2012 డిసెంబర్ 16న దక్షిణ ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల ఫిజియోథెరపీ ట్రైనీని ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి బస్సు నుంచి బయటకు విసిరారు. ఆ యువతి డిసెంబర్ 29న సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో మరణించింది. నిర్భయ రేప్ కేసు(Nirbhaya Case) భారత దేశంలో సంచలనం రేపింది. 2020 జనవరి 22న నలుగురు దోషలకు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిర్భయ కేసు అరుదైన కేసుగా కోర్టు తెలిపింది.
2022 అక్టోబర్ 31న గ్రీష్మ అనే యువతి ఆమె ప్రియుడిని ఆయుర్వేద విషం ఇచ్చి చంపింది. బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్ అయిన షరోన్ రాజ్ కు కన్యాకుమారిలో ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటోన్నప్పుడు అతనికి గ్రీష్మతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి.. ఏడాది పాటు రిలేషన్‌షిప్‌లో కొనసాగారు. అయితే ఇంట్లో వాళ్లు గ్రీష్మకు వేరే సంబంధం చూడటంతో రిలేషన్ బ్రేకప్ చేయడానికి షరోన్ రాజ్ అంగీకరించలేదు. దీంతో అతన్ని చంపేందుకు గ్రీష్మ తన తల్లి, మేనమామ, తల్లితో కలిసి ప్లాన్ చేసింది.
Also Read: Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌కు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ
షరోన్ రాజ్ ను ఇంటికి పిలిచి కూల్ డ్రింక్ లో పారాక్వాట్ డైక్లోరైడ్ అనే ఆయుర్వేద మందును ఇచ్చింది. ఇది తాగి షరోన్ మరణించాడు. ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా షరోన్ రాజ్ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. గ్రీష్మ, నిర్మల్ కుమరన్ నాయర్, ఆమె తల్లి 2022 అక్టోబర్ 31వ తేదీ నేరం చేసినట్లుగా అంగీరించారు. తాజాగా కోర్టు తాజాగా గ్రీష్మకు మరణ శిక్షను ఖరారు చేసింది.
గత 2 దశాబ్ధాలుగా పెరుగుతున్న మరణశిక్షలు ...
దేశవ్యాప్తంగా 2023లో 120 మందికి మాత్రమే ఉరిశిక్ష విధించారు. గత 2 దశాంబ్ధాలుగా మరణశిక్షలు పెరుగుతున్నాయిని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 1980లో ఓ కేసు విషయంలో అరుదైన నేరాలకే ఉరిశిక్ష విధించాలని సుప్రీం కోర్టు ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాన్ని ఇండియా ప్రవేశపెట్టింది.