/rtv/media/media_files/2025/02/20/NjGeAIxzWzc6sq3jnBcZ.jpg)
Kerala cock case
Viral News: కేరళలో ఓ ఆసక్తికర కేసు చర్చనీయాంశమైంది. కోడి కూత కారణంగా నిద్రకు భంగం కలుగుతుందంటూ ఓ వృద్ధుడు కోడిపుంజు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు(Kerala Cock Case). తెల్లవారుజామున 3 గంటలకే ప్రతిరోజు నరకం కనిపిస్తుందని, నిద్రలేమి వల్ల తన హెల్త్ పాడైపోతుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేపట్టిన అధికారులు కీలక ఆదేశాలు జారీ చేయగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
3 గంటలకు టార్చర్ మొదలు..
కేరళలోని పథనంథిట్ట జిల్లా పల్లికల్ గ్రామానికి చెందిన రాధాకృష్ణ, అనిల్‌కుమార్ అనే వ్యక్తుల ఇల్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే అనిల్ ఇంట్లో కోడిపుంజులను పెంచుకుంటున్నాడు. అవి ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు జోరుగా కూతలేస్తున్నాయి. ఒకటి తర్వాత మరొకటి తెల్లావారేసరికి వందసార్లకు పైగా కూతపెడుతున్నాయి. దీంతో విసిగెత్తిపోయిన రాధాకృష్ణ అడూర్ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు
ఆర్డీవో బృందం విచారణ..
ప్రతిరోజు కోడికూతలవల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. వెంటనే నాకు ఉపశమనం కల్పించండి అంటూ రాధాకృష్ణ అధికారులను వేడుకున్నాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్డీవో బృందం.. అనిల్, రాధాకృష్ణ ఇళ్లను పరిశీలించింది. అనిల్ తన ఇంటిపై కోడిపుంజులను పెంచుతున్నట్లు నిర్ధారించుకుని యాక్షన్ మొదలుపెట్టారు. అనిల్ పౌల్ట్రీ షెడ్డును ఖాళీ ప్రాతంగా ఉన్న సౌత్ ఫేస్ దిక్కుకు మార్చాలని తెలిపారు. ఇందుకుగానూ అతనికి 14 రోజుల టైమ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా జనాలు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: క్షమించండి.. ఇకపై అలాంటి సినిమాలు చేయను.. విశ్వక్ సేన్ సంచలన ప్రకటన!
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..