/rtv/media/media_files/2025/02/08/2xJfArjYv1h5YhJLiuBz.jpg)
kejriwal, Congress
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరమైన అవమానాన్ని మూటగట్టకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఎన్నికల ఫలితాల్లో తుడిచిపెట్టుకుపోయారు. ఆప్ నుంచి ఒక్క అతిశీ తప్ప మిగతా ప్రముఖ నేతలంతా ఓడిపోయారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. అన్ని సర్వేల్లో బీజేపీదే హవా అని వచ్చింది కానీ ఎక్కడో ఆమ్ ఆద్మీ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది అనుకున్నారు అంతా. దీనికి కారణం ఆ పార్టీ మీద పడ్డ మచ్చలు...పక్క వ్యూహంతో బీజేపీ ఎన్నికల ప్రచారం చేయడం, బడ్జెట్ ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కానీ అన్నింటికంటే మేజర్ ఫ్యాక్టర్ మాత్రం కాంగ్రెస్. ఆప్ నేతలు గెలవాల్సిన ప్రతీచోటా కాంగ్రెస్ అడ్డుపడింది. అక్కడ ఓట్లను చీల్చి..తమ అభ్యర్థులూ గెలవకుండా..ఆప్ అభ్యర్థులనూ గెలవనీయకుండా చేసింది.
Also Read : కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే!
Thanks INC.....#BJP4IND
— Shubham Mundhe (@Shubham21537089) February 8, 2025
अरविंद केजरीवाल #DelhiElectionResults #DelhiElection2025 #DelhiElections2025 #भाग_केजरीवाल_भाग pic.twitter.com/qzzmSgGo5h
Also Read : ఢిల్లీని గెలిచిన మోదీ.. నెక్ట్స్ టార్గెట్ ఈ రాష్ట్రాలే!
కేజ్రీవాల్ ఓటమికి కాంగ్రెస్స్ కారణం..
న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ 4, 089 ఓట్లతో కేజ్రీవాల్ ను ఓడించారు. పర్వేశ్ కు మొత్తం 30088 ఓట్లు రాగా, కేజ్రీవాల్‌కు 25999 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు 4568 ఓట్లు వచ్చాయి. కరెక్ట్ గా ఇవే ఓట్లు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి. అదే కేజ్రీవాల్ కు సందీప్ దీక్షిత్ వచ్చిన ఓట్లు వచ్చి ఉంటే పర్వేశ్ సింగ్ దాదాపు 500 ఓట్లతో ఓడిపోయేవారు. ఒక్క కేజ్రీవాల్ కు మాత్రమే ఈ పరిస్థితి ఎదురవ్వలేదు. చాలాచోట్ల, చాలా మంది ఆప్ అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థులు గండికొట్టారు. తామూ గెలవలేదు...ఆప్ నూ గెలవనివ్వలేదు.
దెబ్బ తీసిన అతి విశ్వాసం..
మామూలుగా అయితే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ...రెండూ ఇండియా కూటమిలోని పార్టీలు. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమిలో పార్టీలు కలిసి పోటీ చేశాయి. గెలిచినా, ఓడినా క్రెడిట్ ను సమానంగా తీసుకున్నాయి. కానీ ఇక్కడ ఢిల్లీలో పరిస్థితి అది కాదు. ఎన్నికలు మొదలవ్వక ముందు నుంచీ రెండు పార్టీలో పంతానికి పోయాయి. కలిసి పోటీ చేయాల్సి చోట...విడివిడిగా పోటీ చేశాయి. రెండు పార్టీలూ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాయి. అటు కాంగ్రెస్, ఇటు ఆప్ రెండూ తాము ఒంటరిగా గెలిచేస్తామని అనుకున్నాయి. కేజ్రీవాల్ బృందం తమ మ్యాజిక్ పని చేస్తుందని అనుకుంది. నిజానికి కాంగ్రెస్ లేకపోతే చేసేదే ఏమో...కానీ వాళ్ళ ఆశలకు ఆ పార్టీ పెద్ద కన్నం పెట్టిందనే చెప్పాలి. మొదట నుంచీ కాంగ్రెస్ ఇదే తప్పు చేస్తోంది. శత్రువును అంచనా వేయడంలో ఫెయిల్ అవుతూనే వస్తోంది. కొన్నిచోట్ల పొత్తు పెట్టుకుని, మరికొన్ని చోట్ల పెట్టుకోకుండా తుడిచిపెట్టుకుపోయింది. హర్యానా, మహారాష్ట్రల్లో కూడా ఆ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్...ప్రతిపక్ష పార్టీ బలాలను సరిగ్గా అంచనా వేయకపోవడంతో ఓటమి పాలైంది కాంగ్రెస్. అంచనాలకు మించి, చేయ్యలేనివి కూడా హామీలుగా ఇవ్వడం కూడా ఆ పార్టీని దెబ్బ తీస్తోంది. వరుస ఓటములు వస్తున్నా దాని పాఠాలు మాత్రం నేర్చుకోవడం లేదు. హర్యానా, మహారాష్ట్రల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకుని ఉంటే ఢిల్లీలో మళ్ళీ అదే రిపీట్ అయ్యేది కాదు. అలా కాకుండా ఇంకా నెహ్రూ, ఇందిరాగాంధీల టైమ్ లానే ఇప్పుడు కూడా ఏదో చేసేద్దాం అని బయలుదేరుతోంది. కాలంతో పాటూ మార్పును ఆమ్వానించడం లేదు. దీనివలన కాంగ్రెస్సే కాకుండా దానితో పాటూ అలైన్స్ లో ఉన్న పార్టీలు కూడా దెబ్బతింటున్నాయి.
అందరి అభిప్రాయమూ ఇదే..
అమ్మ పెట్టాపెట్టదు...అడుక్కు తినానివ్వదు అని ఓ సామెత..దీనికి పెరఫెక్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్. ఇది కేవలం రాజకీయ విశ్లేషకుల పరిశీలనే కాదు...దేశంలో చాలా మంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే డైరెక్ట్ గానే చెప్పేశారు. బీజేపీ అన్ని చోట్లా గెలవడానికి కారణం రాహుల్ గాంధీనే అని. కాంగ్రెస్ కు బీజేపీని ఎదిరించే సత్తా లేదని...దాని వల్లనే ఆ పార్టీ గెలుస్తోందని చెప్పారు. రీజినల్ పార్టీలు బలంగా ఉండి..ఆ పార్టీలు గెలవాల్సిన చోట కూడా కాంగ్రెస్ వచ్చి చెత్త చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసీ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
— KTR (@KTRBRS) February 8, 2025
Well done 👏 https://t.co/79Xbdm7ktw
Also Read: BJP: కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే!