/rtv/media/media_files/2025/02/19/T0ziQ9h2klqhJqEpek0N.jpg)
Karnataka Mysore brothers and woman died due to online betting
ఆన్‌లైన్ బెట్టింగ్ (Online Betting) తో రోజు రోజుకూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అతి తక్కువ సమయంలో కుబేరుడు అయిపోదామని కొందరు భావించి తెగ అప్పులు చేసి నిండా మునుగుతున్నారు. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి.. చేసిన అప్పు, పెరిగిపోతున్న వడ్డీని ఎలా తీర్చాలో దిక్కుతోచక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!
ఇలాంటి ఘటనలు రోజుకు చాలానే జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువతే బానిస అవుతుండటం గమనార్హం. నిండా 50 ఏళ్లు నిండకుండానే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది.
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
అన్నదమ్ములిద్దరూ బానిస
వారు ఇద్దరు అన్నదమ్ములు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బాగా బానిసలయ్యారు. ఈ క్రమంలోనే ఒకరిపేరు చెప్పి మరొకరు దుబారాగా అప్పులు తీసుకున్నారు. అవి విపరీతంగా పెరిగిపోవడంతో ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
మైసూరు (Mysore) లోని హంచ్యా గ్రామానికి చెందిన జోశి ఆంథోని అప్పుల బాధలు తట్టుకోలేక సోమవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడు అంతక ముందు ఓ వీడియో చేశాడు. దాని ప్రకారం.. తన పేరు, తన సోదరి పేరు చెప్పి తన సోదరుడు జోబి ఆంథోని, మరదలు షర్మిల అప్పులు తెచ్చారని.. దాదాపు రూ.80 లక్షల రుణానికి రోజుకు రూ.2.5 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తోందని అతడు ఆ వీడియోలో ఆరోపించాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో జోబి ఆంథోనీ, అతడి భార్య షర్మిల ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.